Advertisement
Google Ads BL

రిషబ్ ప్లాన్ చేస్తే నేను రెడీ: తారక్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తల్లి షాలిని స్వస్థలమైన కర్ణాటకలోని ఉడిపి సమీపంలోని ఓ దేవాలయంలో తల్లి, భార్య ప్రణతితో కలిసి స్పెషల్ పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కన్నడ కాంతార హీరో రిషబ్ శెట్టి‌తో క్లోజ్‌గా ఉండడమే కాకుండా ప్రతిచోటా రిషబ్ శెట్టితో ఎన్టీఆర్ కనిపించేసరికి.. ఎన్టీఆర్ ఏమైనా కాంతార 2లో కనిపిస్తాడా.. అందుకే ఇంత క్లోజ్‌గా కనిపించారని అందరూ అనుకున్నారు. 

Advertisement
CJ Advs

మీడియా కూడా ఎన్టీఆర్ ని మీరు కాంతారా 2లో కనిపిస్తారా అని అడగగా.. దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ.. ముందుగా దేవాలయం సందర్శించడానికి ఏర్పాట్లు చేసిన రిషబ్ శెట్టికి థాంక్స్ చెప్పాడు. అయితే తాను నటిస్తున్న దేవర చిత్రం గురించి తాను దేవాలయంలో మాట్లాడను, బయట మాత్రమే మాట్లాడతాను అని దేవర కబుర్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు. 

అయితే రిషబ్ శెట్టి‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ.. రిషబ్ ఏదైనా ప్లాన్ చేస్తే నేను అతనితో కలిసి నటించడానికి రెడీ అంటూ.. ప్రస్తుతం కాంతార 2 లో నటించడం లేదు అని చెప్పకనే చెప్పేశాడు ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్-రిషబ్ శెట్టి కలిసి కనిపించే ఆ క్షణం ఎప్పుడు వస్తుందో చూడాలి.

Jr NTR Response on Role in Kantara 2 Question:

Jr NTR and Rishab Shetty In One Frame
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs