Advertisement
Google Ads BL

చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సిందే..


గత ఐదేళ్ళలో అధికారం కోల్పోయి నిత్యం ప్రజల్లో ఉన్న చంద్రబాబును జగన్ స్కిల్స్ స్కామ్ లో ఇరికించి జైలుకు పంపించి కట్టడి చేద్దామని భావించి ఘోరమైన  ఓటమి చవి చూసారు. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమిని ప్రజలు డిసైడ్ చేసారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నారు. గత ఐదేళ్ళలో జగన్ సీఎం గా చెయ్యలేని పని ఈరోజు చంద్రబాబు చెయ్యడం చూసి ప్రజలంతా చంద్రబాబు ను చూసి నేర్చుకోవాల్సిందే అనే కామెంట్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

గత రెండు రోజులుగా ఆకాశానికి చిల్లు పడిందా అనేలా ఏపీలో వర్షాలు, వరదలతో నదులు, చెరువులు పొంగి ఊర్ల మీద పడిపోవడమే కాదు, కనీవినీ ఎరుగని రీతిలో విజయవాడ మహానగరం వరదలతో అతలాకుతలమవుతోంది. బుడమేరు పొంగిపొర్లడం, మరోపక్క విజయవాడను అనుకుని ఉన్న కృష్ణమ్మ పరవళ్లు కాదు ఉగ్రరూపం దాల్చడం విజయవాడ వాసులను ఒణికించేసింది. విజయవాడ సింగ్ నగర్, రామలింగేశ్వర నగర్, భవాని నగర్ ఒకటేమిటి విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. 

పవర్ లేక, నీళ్లలో ఉండలేక ప్రజల ఇక్కట్లు చెప్పనలవి కాదు. సీఎం హోదాలో ఇంట్లో నుంచి అధికారులతో పని చేయించకుండా ప్రజల కోసం వరదల్లో తిరుగుతున్నారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. ఆదివారం విజయవాడలో పలు ప్రాంతాల్లో బోటులో పర్యటించారు. వరద తీవ్రతను స్వయంగా తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు.

ఆదివారం రాత్రి విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బస చేశారు. తన బస్సును అక్కడే పార్క్ చేశారు. అక్కడే అధికారులతో సమీక్ష చేపట్టారు. కాసేపు విశ్రాంతి తర్వాత ఈ తెల్లవారు జామున 4:30 గంటలకు మళ్లీ అధికారులతో సమీక్షలో పాల్గొన్నారు చంద్రబాబు. ప్రకాశం బ్యారేజీ తీరంలో నివసిస్తోన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, విజయవాడలో వరద ముంపునకు గురైన కాలనీల్లో చేపట్టిన సహాయ, పునరావాస చర్యలు, శిబిరాల్లో తలదాచుకుంటోన్న వారికి అందజేస్తోన్న ఆహారం, దినసరి వస్తువులపై సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

వరద తగ్గేవరకూ ప్రజలకు అండగా ఉంటానని మాటిచ్చారు. మరి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా చెయ్యక్కర్లేదు, అధికారులతో పని చేయిస్తే సరిపోతుంది. కానీ ప్రజల కష్టాన్ని బాబుగారు తన కష్టంగా భవించి వారికి అండగా నిలుస్తున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ చంద్రబాబును పోగుడుతున్నారు. 

You have to watch Chandrababu and learn!!:

<span>Andhra Pradesh rains: Chief Minister visited flood affected areas&nbsp;</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs