Advertisement

వైఎస్సార్ వర్ధంతికి కూడా జగన్‌కు అక్షింతలే


2019 నుంచి 2024 వరకు జగన్ పాలనను విమర్శించే వారే ఎక్కువ. 2024 ఎన్నికల్లో ఓడిపోయాక కూడా జగన్ అసలు తాను చేసిన తప్పు తెలుసుకోవడం లేదు అంటూ బ్లూ మీడియా లబో దిబో మంటుంది. జగన్ మారాలి మారాలి అంటూ నినాదాలు చేస్తుంది. జగన్ తప్పులను ఎత్తి చూపిస్తుంది. నేడు వైస్సార్ వర్ధంతి. 

Advertisement

వైస్సార్ వర్ధంతికి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయ వెళ్లి సమాధి వద్ద నివాళులు అర్పించే జగన్.. వైస్సార్ లా ప్రజా పాలన చెయ్యలేదు అనేది జగమెరిగిన సత్యం. సీఎం గా ఉన్నప్పుడు వైస్సార్ నిత్యం ప్రజల్లో ఉంటూ యోగ క్షేమాలను తెలుసుకుని వారి కష్టనష్టాల్లో తోడుగా నిలిచిన మహోన్నత  వ్యక్తి, కానీ జగన్ సీఎం అయ్యాక ఆ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. 

అదే బ్లూ మీడియా చెప్పేది. సమాధి వద్ద నివాళులు అర్పించడం కాదు, ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలతో పోరాడితేనే వైస్సార్ కి నిజమైన నివాళి అని, జగన్ కి చెవిలో జోరీగ మాదిరి బ్లూ మీడియా చెప్పినా జగన్ మాత్రం తీరు మార్చుకోవడమే లేదు. ఇక్కడ ఏపీలో వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతుంటే.. సీఎం చంద్రబాబు డే అండ్ నైట్ ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టపడుతున్నారు. 

ఆ మాదిరి జగన్ గత ఐదేళ్ళలో ఎక్కడా కనిపించలేదు  ఇద్దరు ముగ్గురు మంత్రులు, కొద్దిమంది అధికారులతో, సన్నిహితులతో మాత్రమే జగన్ పాలన సాగించాడు తప్ప ప్రజలను పట్టించుకోలేదు. ఇప్పటికైనా జగన్ మారితేనే పార్టీకి ఆయనకు భవిష్యత్తు అంటూ బ్లూ మీడియా వైస్సార్ వర్దంతి రోజున కూడా జగన్ కు అక్షింతలు వేస్తూనే ఉంది. 

Jagan is the true tribute to YSR:

<span>YSR Vardhanthi Special</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement