Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 8: రెండు పెయిర్స్ వచ్చేశాయి


7.30 PM: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8‌లోకి మూడో కంటెస్టెంట్‌గా అభయ్ నవీన్ (‘పెళ్లిచూపులు’ విష్ణు) పేరును నాగ్ అనౌన్స్ చేశారు. అభయ్ తన గురించి పరిచయం చేసుకుంటున్నాడు. నాగ్‌తో అభయ్ పరిచయం చేసుకుంటున్నాడు. బడ్డీ కాన్సెప్ట్ చెప్పి.. తన బడ్డీ కార్డుని సెలక్ట్ చేసుకోమన్నారు. ఇప్పుడు అభయ్ బడ్డీగా అలాగే నాల్గవ కంటెస్టెంట్‌గా వచ్చిన సీరియల్ నటి ప్రేరణ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తోంది. అనంతరం నాగ్‌తో డిస్కషన్ జరుగుతోంది. హీరోయిన్ రష్మిక మందన్నా తన రూమ్ మేట్ అని చెబుతోంది. నాగ్ ఆమెకు చిన్న టెస్ట్ పెట్టారు. అనంతరం సెకండ్ పెయిర్‌ హౌస్‌లోకి అడుగుపెట్టింది. 

Advertisement
CJ Advs

ఇప్పుడు సెలబ్రిటీ స్పెషల్ నడుస్తోంది. 35- చిన్న కథ కాదు టీమ్‌ నుంచి రానా దగ్గుబాటి వచ్చి చిత్ర విశేషాలను చెబుతున్నారు. తర్వాత చిత్ర టీమ్‌ని నాగ్ స్టేజ్ మీదకు పిలిచారు. సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. రానా, నివేతలను బడ్డీస్‌గా హౌస్‌లోనికి పంపించి.. లోపల ఉన్న కంటెస్టెంట్‌తో గేమ్ ఆడిస్తున్నారు నాగ్. 

7.15 PM: కొన్ని రోజులుగా బుల్లితెర ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు మొదలైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా గ్రాండ్‌గా మొదలైన ఈ వేడుకలో మొదటి కంటెస్టెంట్ వచ్చేశారు. మొదటి కంటెస్టెంట్ ఎవరంటే.. బుల్లితెర నటి యష్మి.. ఫ్లవర్ లా ఉంటుంది కానీ.. ఫైర్ అంటూ యష్మిని నాగ్ పరిచయం చేశారు. అయితే హౌస్‌లోకి వెళ్లే వాళ్లు సింగిల్‌గా కాకుండా బడ్డీతో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. యష్మి బడ్డీగా సీరియల్ నటుడు నిఖిల్‌ని ఆహ్వానించారు. మొదటి పెయిర్ హౌస్‌లోకి అడుగుపెట్టి.. హౌస్ మొత్తం చూస్తున్నారు. హౌస్ చాలా బాగుంది అంటూ బిగ్ బాస్‌కి థ్యాంక్స్ చెప్పారు. 

Bigg Boss Season 8 Launch Episode Live Updates:

Bigg Boss Season 8 Live Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs