Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 8: గ్రాండ్ లాంచ్ డే నే బిగ్ ట్విస్ట్


బిగ్ బాస్ సీజన్ 8 మొదలు కావడానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. ఈరోజు రాత్రి 7 నుంచి స్టార్ మా లో ప్రసారం కాబోయే బిగ్ బాస్ 8 షూటింగ్ అప్పుడే ఆల్మోస్ట్ పూర్తి కావొస్తుంది. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా కాదు జంటలుగా హౌస్ లోకి అడుగుపెడుతూ కనిపించడం, నాగార్జున హోస్ట్‌గా గృహప్రవేశ ఆహ్వానమంటూ ప్రోమో కట్ చేసి వదిలారు.

Advertisement
CJ Advs

మొదటిరోజు అంటే ఓపెనింగ్ రోజే నాని-ప్రియాంక మోహన్‌లు సరిపోదా శనివారం ప్రమోషన్స్ కి వచ్చేశారు. అందులో నానికి 100 అవుట్ ఆఫ్ 100 ఇస్తే ఎస్ జె సూర్యకి ప్రియాంక 101 ఇస్తాను అంటూ సరదాగా చెప్పింది. అలాగే 35 ప్రేమ కథలు నివేత థామస్ - రానా లు ప్రమోషన్స్ కోసం రాగా.. రానా-నివేత లను హౌస్ లోకి వెళ్ళమంటే నివేత నేను 3 డేస్ ఉంటాను, రానా 5 డేస్ ఉంటారు, అప్పుడు ఎలిమినేట్ చెయ్యండి, మా 35 ప్రేమ కథలకు సరిపోతుంది అంటూ ఫన్నీగా మాట్లాడింది.

ఇక బిగ్ బాస్ 8 మొదలైన ఎపిసోడ్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి బిగ్ ట్విస్ట్ అంటూ మొదటిరోజే నేను ఒకరిని బయటికి తీసుకెళ్ళాలి, లక్కీ డ్రాలో వాళ్ళ ప్లేస్‌లో ఒకరు స్వాప్ అయ్యి వాళ్ళు లోపలకి వస్తారు.. అంటూ ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది.

Bigg Twist on Bigg Boss 8 Launch Day:

Bigg Boss 8 Launch Day 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs