Advertisement
Google Ads BL

OG రిలీజ్ డేట్ కోసం మేకర్స్ స్కెచ్


పవన్ కళ్యాణ్‌ని గ్యాంగ్ స్టర్‌గా చూపించబోతున్న దర్శకుడు సుజిత్... పవన్ కళ్యాణ్ కేరెక్టర్ స్టయిల్‌కి ఆయన ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా చేస్తున్నారు. అందుకే OG ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆయన అభిమానులు తెగ వెయిట్ చేసున్నారు. రేపు సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే. OG నుంచి ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్ సిద్దమవుతోందని తెలుస్తోంది.

Advertisement
CJ Advs

ఈ నెల అంటే సెప్టెంబర్ 27 న విడుదల కావాల్సిన OG పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ వలన వాయిదా పడిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కార్యసాధకుడిలా మారిన తర్వాత ఎప్పుడెప్పుడు ఆయన OG సెట్స్ లోకి ఎంటర్ అవుతారా అని OG నిర్మాతలు దానయ్య, దర్శకుడు సుజిత్ కన్నా ఎక్కువగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

అక్టోబర్ నుంచి పవన్ కళ్యాణ్ OG షూటింగ్‌కి డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఓ పది పదిహేను రోజులు OG కోసం సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. అందుకే మేకర్స్ OG రిలీజ్ డేట్ సెట్ చేసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. OG ని మార్చ్ 27 కి విడుదల చేస్తే ఎలా ఉంటుంది.. ఉగాది సెలవలు కూడా కలిసొస్తాయని వారు భావిస్తున్నారట. అందులోనూ అది రామ్ చరణ్ పుట్టినరోజు కూడా కావడం మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

సో పవన్ కళ్యాణ్ మేకర్స్‌కి భరోసా ఇస్తే.. ఇమ్మిడియట్ గా OG డేట్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చేందుకు దానయ్య అండ్ కో రెడీ అవుతుంది అని, కాదు కాదు రేపు పవన్ బర్త్ డే కి OG రిలీజ్ డేట్ లాక్ చేస్తే ఎలా ఉంటుంది అని మేకర్స్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. చూద్దాం రేపటి పవన్ బర్త్ డే OG స్పెషల్ ఏమిటి అనేది.

Makers Sketch For Pawan Kalyan OG Release Date:

OG Movie Release Update on Pawan Kalyan Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs