Advertisement
Google Ads BL

వైఎస్ జగన్.. జీరో కాబోతున్నారా?


వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. హీరో కాస్త జీరో కాబోతున్నారా..? పార్టీలో పరిస్థితులు మళ్లీ మొదటికి రాబోతున్నాయా..? పార్టీ ఆవిర్భావం రోజులను కేడర్ చూడాల్సి వస్తుందా..? వైసీపీలో చివరికి మిగిలేదెవరు..? ఆ నలుగురేనా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇంతకీ వైసీపీలో.. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..? ఇంతకీ నెట్టింట్లో జరుగుతున్న చర్చేంటి..? రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం..!

Advertisement
CJ Advs

ఏం నడుస్తోంది..?

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిన వైసీపీ.. ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి, క్రికెట్ టీమ్‌ 11కే పరిమితం అయ్యింది. ఇందులోని ఆటగాళ్లు కూడా ఎప్పుడు పసుపు టీమ్‌లో చేరిపోతారో అర్థం కాని పరిస్థితి. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే వైసీపీ నుంచి జంపింగ్‌లు షురూ అయ్యాయి. పార్టీ ఓడిపోయాక.. అధికార పార్టీలోకి చేరికలు అనేవి సహజమే కానీ.. జగన్‌కు నమ్మినబంట్లు, లెఫ్ట్, రైట్ హ్యాండ్‌లుగా ఉన్నోళ్లు జంప్ అవుతుంటే అసలేం జరుగుతోందో తెలియక క్యాడర్ తల పట్టుకుంటోంది. పార్టీ మారకుండా ఉండేందుకు ప్లీజ్.. ప్లీజ్ అంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను అధినేత అడుక్కుంటున్నారట. ఎందుకంటే.. లోక్‌సభ ఎంపీలు నలుగురే ఉండటం.. రాజ్యసభ ఎంపీలు గట్టిగానే ఉండటంతో కేంద్రంలోని మోదీ, అమిత్ షా ఇద్దరూ వైసీపీ అడిగిన పనల్లా చేసుకుంటూ వస్తున్నారన్నది జగమెరిగిన సత్యమే. ఇప్పుడు ఎంపీలు పోతే అక్కడ జీరో అయ్యేది జగన్.. ఇక ఆయనతో కేంద్రానికి ఉండే అవసరమేంటి..? అని హైకమాండ్ ఆలోచనలో పడిందట.

ఆఖరికి మిగిలేది..!

మొన్న ఇద్దరు ఎంపీలు, నిన్న ఇద్దరు ఎమ్మెల్సీలు.. రేపు ఇక ఎమ్మెల్యేనా..? అని చర్చించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. టీడీపీ, జనసేన గేట్లు ఎత్తేయడంతో వైసీపీ ఖాళీ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్సీల వంతు అయితే వచ్చేసింది.. ఇక మిగిలింది ఎమ్మెల్యేలు మాత్రమే. అటు ఢిల్లీలో ఇటు గల్లీ (ఏపీలో) వైసీపీని ఖాళీ చేయడమే టీడీపీ టార్గెట్ అని తెలుస్తోంది. అందుకే ఎవరొచ్చినా సరే.. చేర్చుకోవడమే అన్నట్లుగా సీఎం చంద్రబాబు ఉన్నారు.. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పార్టీ బలోపేతానికి డోంట్ వర్రీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఎంతైనా అధికారంలో ఉంటే ఆ కిక్కే వేరు కదా అందుకే జంప్ అయిపోతున్నారేమో. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఆఖరికి వైసీపీలో వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మిగులుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయినా.. జీరో నుంచి హీరో అవ్వడం వైసీపీకి కొత్తేమీ కాదని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయ్. ఏం జరుగుతుందో.. వైసీపీ ఫ్యూచర్ ఏంటో చూడాలి మరి.

Is YS Jagan going to be zero?:

Big Jhalak to YS Jagan Mohan Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs