Advertisement
Google Ads BL

తల్లి కోరిక తీర్చిన తారక్..


యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన మదర్ కలను నెరవేర్చారు. అదీ కూడా సెప్టెంబర్ 2న తన తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని.. అంతకంటే ముందే ఆమె కలను తీర్చడం మాములు విషయం కాదు. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ల మదర్ కల ఏంటని అనుకుంటున్నారా? తన స్వగ్రామం అయిన కుందాపురానికి తీసుకెళ్లి.. ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించడం. ఎప్పటి నుంచో అనుకుంటుండగా.. తారక్ ఇప్పటికీ ఆమె కలను తీర్చారు. 

Advertisement
CJ Advs

ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆరే తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన ఫొటోలను షేర్ చేసిన తారక్.. నన్ను మా అమ్మ స్వగ్రామం అయిన కుందారపురానికి తీసుకెళ్లాలని, అలాగే ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని నాతో కలిసి దర్శించుకోవాలనే అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది. సెప్టెంబర్ 2న అమ్మ పుట్టినరోజు. అమ్మ పుట్టినరోజుకు ముందే ఇలా చేయడం.. నేను ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతిగా భావిస్తున్నాను. దీనికి కారణమైన విజయ్ కిరంగదూర్, నా స్నేహితుడు ప్రశాంత్ నీల్‌కు థ్యాంక్స్. 

వారితో పాటు.. నాకు తోడుగా ఉండి మా అమ్మ కల సాధ్యం చేసినందుకు నా ప్రియమైన మిత్రుడు రిషబ్ శెట్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. అలాగే ఆయన షేర్ చేసిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Jr NTR Fulfilled His Mother s Dream:

Jr NTR And His Family at Udupi Srikrishna Math
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs