గబ్బర్‌సింగ్ ఈవెంట్‌లో హరీష్ అదిరే స్పీచ్
- గబ్బర్‌సింగ్ అంటే చరిత్రతో నిలిచిపోయే సినిమా కాదు.. గబ్బర్‌సింగ్ అంటేనే చరిత్ర
- నాకు, బండ్ల గణేష్ జీవితాలను మార్చేసిన సినిమా గబ్బర్‌సింగ్
- గబ్బర్‌సింగ్ అనేది ఒక మెమరీ కాదు, అనుభవం కాదు.. వీటన్నింటికీ మించి
- సినిమా బాగుంటే హిట్ అంటారు, చాలా బాగుంటే సూపర్ హిట్ అంటారు. అంతకుమించి ఉంటే బ్లాక్‌బస్టర్ అంటారు.. దానిని కూడా మించితే దానిని గబ్బర్‌సింగ్ అంటారని ఫ్యాన్స్ అంటుంటే చాలా సంతోషంగా ఉండేది.
- నా మీద అభిమానులు చూపిస్తున్న అభిమానం అంతా పవన్ కళ్యాణ్ గారిదే.. ఆయన అందరికీ అందుబాటులో ఉండరు కాబట్టి.. నేను పూజారిలాంటి వాడిని మాత్రమే.
- కళ్యాణ్‌గారు ఎప్పుడూ సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ఆలోచించరు. కానీ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని బలంగా కోరుకున్న వ్యక్తి మాత్రం, బ్లాక్‌బస్టర్ అని జపం చేసిన వ్యక్తి మాత్రం బండ్ల గణేష్.
- ఈ సినిమా సక్సెస్ విషయంలో నాకంటే, కళ్యాణ్‌గారి కంటే పెద్ద సంకల్పం ఉన్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ బండ్ల గణేష్.
- 24 గంటలూ బ్లాక్‌బస్టర్ నామస్మరణే.. ఫోన్ లిఫ్ట్ చేయగానే బ్లాక్‌బస్టర్.. ఫోన్ పెట్టేసేముందు బ్లాక్‌బస్టర్. ఎవరైనా సెట్‌లో హిట్ అంటే బండ్ల గణేష్‌కి కోపం వచ్చేది.
- ఈ సినిమాకు సెట్‌లో నేను ఎంత కష్టపడ్డానో.. సెట్ బయట బండ్లన్న అంతకంటే ఎక్కువ కష్టపడ్డారు.
- బండ్ల గణేష్ కోసమైనా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలనే ఫీలింగ్ యూనిట్ అందరిలో వచ్చిందంటే.. ఎంతగా ఆయన తపించారో అర్థం చేసుకోవచ్చు.
- పుష్కరాలు 12 సంవత్సరాలకు వస్తాయి.. గబ్బర్‌సింగ్ సినిమా కూడా అంతే.. మళ్లీ 12 సంవత్సరాలకి 25 సంవత్సరాల యానివర్సరీ.. బతికుంటే 50 ఇయర్స్ కూడా నడుస్తుంది. ఇది ఇలాగా కంటిన్యూ అవుతుందని బలంగా నమ్ముతున్నా..
- గబ్బర్‌సింగ్ సక్సెస్ అవుతుందని మొదట ఊహించిన వ్యక్తి పవన్ కళ్యాణ్‌గారు.
- నా ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి కోరుకుంటున్న సక్సెస్‌ని నువ్వు ఇవ్వబోతున్నావ్.. ఈ సినిమా నువ్వు ఊహించని సక్సెస్ అవుతుంది. నువ్వు మాములుగా చాలా స్పీడ్‌గా ఉంటావు.. ఈ సినిమా తర్వాత నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కాబోతోంది అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ కలవలేదు. సినిమా విడుదలైన నాలుగైదు రోజులకి కలిశారు.
- అప్పుడు కూడా ఫ్యాన్స్ హ్యాపీనా అన్నారు తప్పితే.. ఎంత కలెక్ట్ చేస్తుంది.. ఏ రికార్డులు బద్దలు కొడుతుంది అని మాత్రం అడగలేదు
- అప్పుడాయన ఆటోగ్రాఫ్‌కి.. ఇప్పుడాయన సంతకానికి చాలా పవర్ ఉంది. ఇప్పుడాయన సంతకం కొన్ని జీవితాలనే మార్చేస్తుంది. అంత శక్తి ఆ సంతకానికి ఇచ్చిన ఆ భగవంతుడికి, దాని కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎంటైర్ గబ్బర్‌సింగ్ యూనిట్ తరపున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. లాంగ్ లివ్ పవన్ కళ్యాణ్.
Advertisement
CJ Advs
Harish Shankar Speech at Gabbar Singh Re Release Press Meet:
Harish Shankar Excellent Speech about Gabbar Singh
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads