కింగ్ నాగార్జున నా సామి రంగ చిత్రం తర్వాత సోలో హీరోగా ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారని అక్కినేని అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. నాగ్ మాత్రం సోలో హీరోగా సినిమా అనౌన్స్ చేయకుండా తమిళ హీరోల సినిమాల్లో కీలక పాత్రలకు సైన్ చేస్తున్నారు. ఇప్పటికే ధనుష్ కుబేరలో నాగార్జున ఓ కీ రోల్ ప్లే చేస్తున్నారు.
గతంలోనూ హిందీ చిత్రమైన బ్రహ్మాస్త్రలో నాగార్జున కనిపించారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీలో నాగార్జున నటిస్తున్నారనే వార్త వినిపించినా.. దానిని నాగ్ బర్త్ డే రోజున కన్ఫర్మ్ చేశారు మేకర్స్. రజినీకాంత్, లోకేష్ కనగరాజ్‌ల కాంబోలో వస్తోన్న కూలీ చిత్రంలో నాగార్జున మాస్‌గా కనిపించబోతున్నట్లుగా లుక్ వదిలారు. అయితే నాగార్జున ఇలా సోలోగా కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో కనిపించడం ఏమిటా అని అక్కినేని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
తాజాగా నాగార్జునకు.. హీరో కన్నా ఇలాంటిస్పెషల్ కేరెక్టర్స్‌లో కనిపిస్తే రెమ్యునరేషన్ పరంగా బాగా వర్కౌట్ అవుతుంది అని.. కూలీలో నాగార్జున నటించినందుకు గాను మేకర్స్ ఏకంగా 24 కోట్లు పారితోషికం ఇస్తున్నారనే వార్త చూసి అందుకే నాగార్జున ఇలా టెంప్ట్ అయ్యారేమో అంటూ గుసగుసలాడుకుంటున్నారు. కుబేరకు కూడా నాగార్జున 10 కోట్లు పైనే పుచ్చుకున్నారట.
అందుకేనన్నమాట నాగార్జున ఇలా స్టార్ హీరోల సినిమాలో స్పెషల్ కేరెక్టర్స్ చెయ్యడానికి వెనక్కి తగ్గడమే లేదు.