Advertisement
Google Ads BL

కాదంబరి కానుందా మరో శ్రీరెడ్డి..?


కాదంబరీ జెత్వానీ.. వారం రోజులుగా ఎవరి నోట విన్నా, ఎక్కడ చూసినా వినిపిస్తున్న.. కనిపిస్తున్న పేరు! వైసీపీ హయాంలో పేరుగాంచిన బిజినెస్‌మెన్, ఆ పార్టీ నేత వాడుకొని పెళ్లి చేసుకోకుండా వదిలేయడమే కాకుండా చిత్ర హింసలు పెట్టారన్నది ముంబై హీరోయిన్ ప్రధాన ఆరోపణ. దీన్ని పట్టుకున్న టీడీపీ రచ్చ రచ్చ చేసేసింది. ఇందుకు కొన్ని మీడియా సంస్థలు ఒక్కటే డిబేట్లు, స్పెషల్ స్టోరీలు. నిద్ర లేచింది మొదలుకుని పడుకునే వరకూ అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో జెత్వాని.. జెత్వాని.. ఇదే మాట వినిపిస్తోంది. ఫిర్యాదు చేస్తే ఇబ్బంది పెట్టిన నేతలు, ఉన్నతాధికారులపై తగు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఓపెన్ స్టేట్మెంట్ చేసేసింది.. దీంతో ముంబై నుంచి జెత్వాని విజయవాడ విచ్చేసింది.

Advertisement
CJ Advs

ఎవరేం తక్కువ కాదే..!

జెత్వాని విషయంలో అటు టీడీపీ.. ఇటు వైసీపీ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. పార్టీ గుర్తు నీలి రంగు.. నేతలు చేసే చిత్రాలు నీలి చిత్రాలు.. అనుకూల మీడియా నీలి మీడియా అంటూ స్వయానా మంత్రులే మీడియాకు ముందుకు వచ్చి తిట్టి  పోస్తున్న పరిస్థితి. అరే బాబూ.. పార్టీకి, సదరు వ్యక్తి ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఇదిగో ఇదీ కాదంబరీ అసలు సిసలైన కథ అంటూ రీల్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ జీవించేసిందంటూ బాగోతం బయటపెట్టింది వైసీపీ. పెద్ద పెద్ద బిజినెస్‌మెన్లు, డబ్బున్నోళ్లును మోసం చేసినట్లు, ఆఖరికి భర్తతో కూడా చెడిందని పెద్ద డాక్యుమెంటరీనే వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. వృత్తి యాక్టర్.. ప్రవృత్తి బ్లాక్ మెయిలర్ అంటూ వైసీపీ మీడియా, సోషల్ మీడియా రచ్చ రచ్చే చేస్తోంది.

వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలు, పోలీసులు నన్నొక అట బొమ్మలా ఆడుకున్నారని జెత్వానీ చెబుతోంది. వైసీపీ, టీడీపీ.. కాదంబరీ ఎవరికి తోచినట్లుగా వాళ్లే చెప్పుకుంటున్నారు.. రాసేసుకుంటున్నారు. అసలు కథేంటో పైనున్న పెరుమాళ్లకే తెలుసు.

మరో శ్రీరెడ్డేనా..?

వాస్తవానికి.. కొన్నేళ్ల కిందట శ్రీరెడ్డి విషయంలో వైసీపీ-టీడీపీ, జనసేన మధ్య ఎలాంటి రచ్చ అయితే జరిగిందో అంతకుమించే ఇప్పుడు జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇందుకు ఆజ్యం పోస్తూ ఒకట్రెండు మీడియా సంస్థలూ ఎలా రెచ్చిపోయాయో కూడా చూశాం. సీన్ కట్ చేస్తే.. తెలుగు రాష్ట్రాలను, సినిమాలను అన్నీ వదులుకుని తమిళనాడులో వెళ్లి బతకాల్సిన పరిస్థితి. నాడు ఇదే శ్రీరెడ్డిని టీడీపీ అండ్ కో మీడియా రెచ్చగొట్టి ఇదంతా చేసిందని.. ఇందులో వైసీపీ పాత్ర లేకపోలేదన్నది జెత్వానీ ఎపిసోడ్‌తో మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు కాదంబరి టీడీపీ దగ్గరున్న అస్త్రం అని ఏమైనా చేయొచ్చన్నది వైసీపీ వాదన. టీడీపీ-వైసీపీ మధ్యలో హీరోయిన్ నలిగిపోవడం పక్కా అని.. ఇదంతా రాజకీయం చేసుకుంటున్న రచ్చే కానీ చివరికి ఆ ముద్దుగుమ్మకు ఒరిగేదేమీ ఉండదని విశ్లేషకులు చెబుతున్న మాట. కేసులు పెట్టాక ఎవరెవరు బొక్కలోకి వెళ్తారో..? ఈ వ్యవహారంలో సూత్రదారులు, పాత్రదారులు ఎవరనేది..? త్వరలోనే తేలిపోనుందన్న మాట.

ఇంకేం లేవా..?

అయినా ఏపీలో ఇంకేమీ సమస్యలు లేనట్టు ఒక్క కాదంబరీ వ్యవహారమే కూటమి సర్కార్‌కు కనిపిస్తోందా అనే ప్రశ్నలు సామాన్యుడి నుంచి పెద్ద ఎత్తునే వస్తున్నాయ్. సూపర్ సిక్స్ హామీల అమలు, హాస్టల్స్‌లో ఫుడ్ సర్లేదని కొన్ని చోట్ల గొడవలు.. మరికొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్.. గుడివాడలోని ఓ కాలేజీలో బాలికల హాస్టళ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరించడం ఇలా ఒకటా రెండా సవాలక్ష సమస్యలు పరిష్కారం కానివి ఉన్నాయ్ కదా.. వాటి సంగతేంటి..? అనే ప్రశ్నలు వస్తున్నాయ్.. ఈ పరిస్థితుల్లో వైసీపీని అస్తమానూ బ్లేమ్ చేయడం మాని సర్కార్‌ను సక్రమంగా నడుపుకుంటూ పోతే మంచిదని విమర్శకులు చెబుతున్నారు. అయినా జెత్వాని సినిమా ఇప్పుడే మొదలైందిగా.. జస్ట్ టీజర్ అంతే.. ట్రైలర్, అసలు సిసలైన పిక్చర్ ఎలా ఉంటుందో ఏంటో..!

Will Kadambari be another Sri Reddy?:

Kadambari Jethwani Case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs