Advertisement
Google Ads BL

పవన్ బర్త్ డే : ఉస్తాద్ నుంచి ట్రీట్ పక్కా


పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2. పవన్ బర్త్ డే కోసం ఆయన అభిమానులు ఏడాదిగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. గత ఏడాది బ్రో తర్వాత పవన్ కళ్యాణ్ మూవీ ఏది విడుదల కాలేదు. ఈలోపు రాజీయాలు, డిప్యూటీ సిఎం హోదా తో పవన్ స్టేటస్ పూర్తిగా మారిపోయింది. అయినప్పటికి ఆయన సినిమాలు సెట్స్ మీద ఉండడంతో ఆ అప్ డేట్స్ కోసం పవన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ లో ఒకరు ఈరోజు ఓ సినిమా ఈవెంట్ లో కనిపించగానే మీడియా వారు ఉస్తాద్ భగత్ సింగ్ అప్ డేట్ పై ఆరా తీశారు. దానికి మైత్రి వారు సమాధానమిస్తూ.. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ అవుతుంది, పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే డిసెంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసేస్తామని చెప్పారు. 

అంతేకాదు అన్ని సక్రమంగా జరిగితే మార్చ్ లో కల్లా ప్రేక్షకుల ముందుకు తెస్తామని చెప్పిన ఆయన ఇప్పటివరకు చిత్రీకరించిన  అతి తక్కువ కంటెంట్ నుంచి చాలా వీడియోస్ వదిలాము, ఈ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా ఒక స్పెషల్ ట్రీట్ ఖచ్చితంగా ఉంటుంది అంటూ ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ పై అప్ డేట్ అందించడంతో పవన్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.  

Pawan birthday: A treat from Ustaad Bhagath Sing:

Pawan Kalyan Ustaad Bhagat Singh: Major Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs