పుష్ప 2 ద రూల్ డిసెంబర్ 6 న పక్కా అంటూ మైత్రి మూవీ మేకర్స్ మరోసారి స్పష్టం చేసారు. డిసెంబర్ 6 నుంచి పుష్ప ద రూల్ పోస్ట్ పోన్ అవ్వబోతుంది, మార్చ్ లో పుష్ప ద రూల్ రిలీజ్ అయ్యే సూచనలున్నాయంటూ కొన్ని గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సందర్భంలో మేకర్స్ చాలాసార్లు పోస్టర్స్ తో క్లారిటీ ఇచ్చినా నేడు మీడియా ముందు పుష్ప డిసెంబర్ 6 న పక్కా అని స్పష్టతనిచ్చారు.
అంతేకాదు వినాయకచవితికి పుష్ప 2 నుంచి ఏమైనా అప్ డేట్ ఉంటుందా? పాట వదిలే ఉద్దేశ్యం ఎమన్నా ఉందా అని అడిగిన మీడియా ప్రశ్నకు లేదండి.. వినాయకచవితికి ఏమి అనుకోలేదు, పుష్ప నుంచి రెండు పాటలు రావాల్సి ఉంది. అందులో ఒకటి సెప్టెంబర్ చివరిలో, రెండోది అక్టోబర్ లో విడుదల చేస్తామని చెప్పారు.
ఇక ఇప్పుడు ఫస్ట్ కాపీ ఇవ్వడంతో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. అక్టోబర్ ఫస్ట్ వీక్ కల్లా ఫైనల్ కాపీ వస్తుంది, నవంబర్ 20 కల్లా అన్నిచోట్లకి ప్రింట్స్ వెళ్లిపోయేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నామని ఆయన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పై క్లారిటీ ఇచ్చారు. ఇక డిసెంబర్ 5 న పుష్ప ప్రీమియర్స్ ఉంటాయా అని అడగగానే.. చూస్తామండి, ఒకరోజు ముందు పుష్ప2 ప్రీమియర్స్ ఉండే అవకాశం ఉంది అంటూ మైత్రి మూవీ మేకర్స్ లో ఒకరైన నవీన్ పుష్ప 2 పై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు.