తెలంగాణ BRS ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి ఈడీ విచారణ, CBI విచారణ అంటూ గత ఐదు నెలలుగా ఆమె తీహార్ జైలులోనే ఉంది. ఈ మధ్యలో నాలుగైదు సార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినా పని జరగలేదు. తన కొడుక్కి ఎగ్జామ్స్ అని ఒకసారి, హెల్త్ రీజన్స్ తో మరోసారి బెయిల్ కి అప్లై చేసిన కవితకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. దానితో కవిత బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్ళింది.
రెండు రోజుల క్రితమే కవిత కు సుప్రీం లో బెయిల్ వచ్చింది. ఆ తర్వాత తీహార్ జైలు నుంచి బయటికొచ్చిన కవితకు BRS నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అంతేకాదు కవిత అన్న KTR కు రాఖి కట్టింది. కొడుకుని కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకున్న కవిత నేడు తండ్రి KCR ఉంటున్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి తండ్రి కాళ్ళ మీద పడింది.
తండ్రి ఆశీస్సులు తీసుకున్న కవిత తండ్రి ని కౌగలించుకుని ఎమోషనల్ అయ్యింది. అయితే కవిత కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్న కార్యకర్తలకు, నేతలకు కవిత ఓ మనవి చేసింది. ఓ పది రోజులు విశ్రాంతి తర్వాత అందరిని కలుస్తాను, అర్ధం చేసుకోవాలంటూ వారిని కోరింది.
కవితకు బెయిల్ వచ్చేముందు ఆమె వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె వెయిట్ కూడా బాగా తగ్గినట్లుగా కనిపిస్తుంది. ఐదు నెలల జైలు జీవితంలో ఎమ్యెల్సీ కవిత రెండుసార్లు అనారోగ్యానికి గురికావడంతో ఆమె బరువు తగ్గినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్న విషయాన్ని నేతలకు, కార్యకర్తలకు చెప్పింది.