Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 8 ఎంట్రీ పై కిర్రాక్ ఆర్పీ క్లారిటీ


బిగ్ బాస్ సీజన్ 8 అనుకున్నప్పటి నుంచి కొన్నాళ్లుగా కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలుస్తున్న కిర్రాక్ ఆర్పీ హౌస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ చాలా గట్టిగా ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ నుంచి బయటికొచ్చే ఆ యాజమాన్యం పై కిర్రాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ అన్ని ఇన్ని కావు. ఆ తర్వాత నెల్లూరి పెద్దారెడ్డి చేపలపులుసు తో ఫేమస్ అయ్యాడు.

Advertisement
CJ Advs

ఇక 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కి తోడుగా జనసేన వైపు నిలబడ్డాడు. కేవలం సపోర్ట్ మాత్రమే కాదు వైసీపీ నేతలపై రెచ్చిపోయి కామెంట్స్ చేసాడు. అల్లు అర్జున్ పై ఇష్టమొచ్చినట్టుగా నోరు పారేసుకున్నాడు. జబర్దస్త్ లో దేవతగా పూజించిన రోజాను నానా మాటలన్నాడు.

ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ లోకి వెళితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటూ బుల్లితెర ప్రేక్షకులు ఇంట్రస్ట్ చూపించే కొద్దీ యూట్యూబ్ ఛానల్స్ కిర్రాక్ ఆర్పీ పేరు బిగ్ బాస్ కి ముడివేసి ప్రచారం చేస్తున్నాయి. మరో మూడు రోజుల్లో మొదలు కాబోయే బిగ్ బాస్ హౌస్ లోకి కిర్రాక్ ఆర్పీ ఎంట్రీ ఇస్తాడనుకున్న సమయంలో ఆర్పీ బిగ్ బాస్ విషయంలో రియాక్ట్ అయ్యాడు.

బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్స్ చేయమని అడిగిన మాట వాస్తవమేనని, ఇప్పుడే కాదు చాలా సీజన్‌ల నుంచి తనని సంప్రదిస్తున్నారని చెప్పిన కిరాక్ ఆర్పీ తానేమీ బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లడం లేదని స్పష్టం చేశాడు. 

Kirrak RP on Bigg Boss 8 Entry:

Kirrak RP Clarity on Bigg Boss 8 Entry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs