Advertisement
Google Ads BL

కట్టుదిట్టమైన ఏర్పాట్లతో దర్శన్ జైలు జీవితం


కన్నడ హీరో దర్శన్ తన అభిమాని రేణుక స్వామి హత్య కేసులో A 1 నిందితుడిగా బెంగుళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. దర్శన్ తో పాటుగా ఆయన ప్రేయసి పవిత్ర గౌడ ఇంకా 14 మంది నిందుతులు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే బెంగుళూరు జైలులో దర్శన్ కి అక్కడి జైలు అధికారులు రాచమర్యాదలు చేస్తున్న ఫొటోస్ లీకై సెన్సేషన్ సృష్టించాయి. దానితో కర్ణాటక ప్రభుత్వం హుటాహుటిన జైలులోని కొంతమంది అధికారులను సస్పెండ్ చేసింది. 

Advertisement
CJ Advs

కర్ణాటక ప్రజల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేఖత నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం దర్శన్ ని కట్టుదిట్టమైన భద్రత నడుమ బెంగుళూరు జైలు నుంచి బళ్ళారి సెంట్రల్ జైలుకు మార్చింది. ఈరోజు గురువారం ఉదయం దర్శన్ ని పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో భారీ భద్రత నడుమ బళ్లారి జైలుకు తరలించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. 

బళ్లారి సెంట్రల్ జైలులో హై సెక్యూరిటీ మధ్యన సెల్ లో దర్శన్ ని ఉంచారు. దర్శన్ బ్లాక్ టి షర్ట్ తో కుడి చేతికి బ్యాండేజ్ వేసుకుని కనిపించాడు. ఇక బళ్లారి జైలుకు చేరుకున్న దర్శన్ జైలు వద్ద ఎంట్రీ బుక్ లో సంతకం పెట్టి వెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

Darshan prison life with strict arrangements:

Darshan was transferred to Ballari prison on Thursday morning under heavy police security
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs