మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ తెరకు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే కూడా శ్రీలీల లా టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో బిజీ హీరోయిన్ అవుతుంది అనే భావనలో చాలామంది కనిపించారు. మిస్టర్ బచ్చన్ ప్రోమోస్, సాంగ్స్, ట్రైలర్ చూసి భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారుతుంది, చాలామంది హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది అని అనుకున్నారు. నిజంగానే భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ లో చాలా అందంగా, గ్లామర్ షో చేసింది.
సినిమా రిజల్ట్ పాజిటివ్ గా ఉంటే భాగ్యశ్రీ బోర్సే అందాల విందు కు న్యాయం జరిగేది. అంటే ఆమెకి ఇక్కడ యంగ్ హీరోలు వరసగా ఆఫర్స్ ఇచ్చేవారు. కానీ మిస్టర్ బచ్చన్ రిజల్ట్ తేడా కొట్టడంతో భాగ్యశ్రీ బోర్సే అందాల జాతరకు అన్యాయం జరిగింది. అంత అందం ఆరబోసినా అదంతా వృధానే అయ్యింది.
కనీసం మిస్టర్ బచ్చన్ కు యావరేజ్ టాక్ వచ్చినా భాగ్యశ్రీ బోర్సే కు ఎంతోకొంత ఫలితం దక్కేది. మిస్టర్ బచ్చన్ విడుదలకు ముందే భాగ్యశ్రీ బోర్సే కి అవకాశాలు వస్తున్నాయి. యంగ్ హీరోల చూపు భాగ్యశ్రీ బోర్సే పై పడింది అని చెప్పుకున్నారు. కానీ అవి ఇప్పుడు జస్ట్ రూమర్స్ గా మిగిలిపోయేలా కనిపిస్తున్నాయి తప్ప అవకాశం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.