Advertisement
Google Ads BL

ఎక్కడికో పోతున్న మెగా-అల్లు వార్


ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా-అల్లు వార్ రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ విషయంలో అల్లు అర్జున్ తీరు మెగా-పవన్ ఫ్యాన్స్ కి నచ్చలేదు, రీసెంట్ గాను అల్లు అర్జున్ నాకు నచ్చితే చేస్తాను అని చెప్పడం అగ్గికి ఆజ్యం పోసింది. మరోపక్క జనసేన ఎమ్యెల్యే బొలిశెట్టి అల్లు అర్జున్ పై ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు అభిమానుల మధ్యన వార్ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు అల్లు అర్జున్ పై, అల్లు అరవింద్ పై, అల్లు రామలింగయ్య పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. 

అల్లు రామలింగయ్య వల్ల మెగాస్టార్ చిరంజీవి గారు ఎదిగారు అంటే నవ్వి చస్తారు జనాలు. పాత NTR, ANR వద్దు, కొత్తగా వచ్చిన డాన్స్, ఫైట్స్ తో ఇరగదీస్తున్న హీరో చిరంజీవే కావాలని ప్రేక్షకుల డిమాండ్ కి తలొగ్గి నిర్మాతలు కూడా చిరంజీవి గారికే ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సొచ్చింది. 

పెళ్లి అయ్యాక చిరంజీవి గారు కూడా బామ్మర్దిని నిర్మాతగా నిలబెట్టాలని అరవింద్ గారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన తెలివి, అదృష్టం కూడా కలిసివచ్చి మంచిగా ఎదిగారు. డిమాండ్ ఉన్న హీరోలు నచ్చిన నిర్మాతతో సినిమాలు చేస్తారు. నిర్మాతలు హీరోలని చెయ్యడం సాధ్యం కాదు!ఇదొక చెత్త పనికిమాలిన వాదన అని ఓ గా అభిమాని ట్వీట్ చేసాడు. 

దానికి కౌంటర్ గా మరో మెగా అభిమాని.. నోరుంది కదా అని వాగి దొబ్బడమే, అల్లు రామలింగయ్య వల్ల చిరంజీవి ఎదగడం ఏంటి ?? అల్లు తాత పెద్ద స్టార్ కమెడియన్ కూడా కాదు, విలన్ కింద చెంచా పాత్రలు వేసుకునే వాడు, పోనీ ఇంతకముందు ఎవరినయినా పైకి తీసుకొచ్చి ఉద్దరించాడా అంటే అది లేదు అంటూ మెగా అభిమానులు అల్లు ఫ్యామిలీపై విరుచుకుపడుతున్నారు. మరి ఈ వార్ ఎక్కడికి దారి తీస్తుందో అని మిగతా కామన్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. 

A Mega-Allu war that is going nowhere:

Allu Arjun vs Mega family.. ? A war going on.. ?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs