బిగ్ బాస్ 8 మొదలు కావడానికి మరో రెండు రోజులు మాత్రమే సమయముంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు మొదలు కాబోయే గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ ని శనివారం నుంచే షూట్ చెయ్యడం మొదలు పెడతారు. నాగార్జున హోస్ట్ గా మొదలు కాబోయే సీజన్ 8 కి ఎవరెవరు హౌస్ లోకి అడుగుపెడుతున్నారనే విషయంలో సస్పెన్స్ నడుస్తుంది.
కారణం నిన్నమొన్నటివరకు ఫైనల్ లిస్ట్ అన్న వారు ఈరోజు అసలు లిస్ట్ లో లేకుండా పోవడమే. హౌస్ లోకి ముందుగా 18మంది అడుగుపెడతారని తెలుస్తుంది. ఇప్పటికి 14 మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ముందుగా రాజ్ తరుణ్ ఫ్రెండ్, ఈమధ్యన లావణ్య వ్యవహారంలో కాంట్రవర్సీ గా మారిన ఆర్జే శేఖర్ భాషా సీజన్ 8 హౌస్ లోకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది.
హీరో ఆదిత్య ఓం, స్టార్ మా సీరియల్ యాక్టర్ నిఖిల్, కన్నడ నటి యష్మి గౌడ, ఢీ డాన్సర్ నైనిక, యాక్టర్ అభిరామ్ వర్మ, యాక్టర్ అభయ్ నవీన్, కిరాక్ సీత, బెజవాడ బేబక్క, యాక్టర్ ఖయ్యూం, యాంకర్ విష్ణు ప్రియ, రీతు చౌదరి, విస్మయ శ్రీ తో పాటుగా సహర్ కృష్ణన్, ఇంద్రనీల్, న్యూస్ రీడర్ కళ్యాణి, జబర్దస్త్ రాకింగ్ రాకేష్ లు ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారని, ముందుగా 14 మంది హౌస్ లోకి పంపి ఆ తర్వాత నలుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వారం వారం పరిచయం చేస్తారని తెలుస్తుంది.