గేమ్ ఛేంజర్ షూటింగ్ కి అంతూ పొంతూ లేదు అన్నట్టుగా శంకర్ మళ్ళీ రీ షూట్స్ అంటున్నారు అనగానే మెగా ఫ్యాన్స్ నెత్తిన పిడుగుపడ్డట్టు అయ్యింది. రామ్ చరణ్ గత నెలలోనే గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసేసాడు. దానితో అతను తన తదుపరి మూవీ కోసం ప్రిపేరవుతున్న సమయంలో గేమ్ ఛేంజర్ రీ షూట్స్ అంటూ వస్తున్న వార్తలతో మెగా ఫ్యాన్స్ తల పట్టుకునున్నారు.
అసలు శంకర్ ఇప్పటివరకు రిలీజ్ డేట్ లాక్ చెయ్యకుండా అభిమానుల సహననానికి పరిక్ష పెడుతున్నారు. గేమ్ చెంజర్ స్టేటస్ తెలియక మెగా అభిమానులు అయోమయంలో ఉన్నారు. తాజాగా సెప్టెంబర్ 7 వినాయకచవితికి గేమ్ ఛేంజర్ నుంచి ఏదో స్పెషల్ అప్ డేట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.
అది రిలీజ్ డేట్ కావొచ్చు, లేదంటే మరేదన్నా కావొచ్చు. అదేమిటి అనే విషయంలో ఆలోచించే కన్నా అసలు గేమ్ ఛేంజర్ నుంచి ఏదో ఒక అప్ డేట్ బయటికి వస్తుంది అని మెగా అభిమానులు ఆనందపడుతున్నారు. మరి వినాయకచవితికి శంకర్ ఏం ప్లాన్ చేసారో చూడాలి.