అవును.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ముగ్గురు ఎమ్మెల్యేలు, మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు..! మంచిగా, మర్యాదగా ఉండండి లేకుంటే తాట తీస్తా..! మీ ముగ్గురు ఎమ్మెల్యేల వల్ల తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వస్తోంది..! అని గట్టిగా క్లాస్ తీసుకున్నారు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇకపైన కూడా మార్పు రాకుంటే అంతే సంగతులు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు సీబీఎన్.
అసలేం జరిగింది..?
బుధవారం నాడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. అసలేం జరుగుతోంది..? కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యంగా ముగ్గురు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు..? వారి ప్రవర్తన కారణంగా ఇన్నాళ్ళు టీడీపీకి నిర్మించుకున్న మంచి పేరు దెబ్బ తింటున్నది. అంటూ కన్నెర్ర చేశారు. దినపత్రికలు, టీవీ ఛానెల్స్ నిండా ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లు ప్రస్తావిస్తూ ఎందుకు వార్తలు వస్తున్నాయ్..? ఎందుకు ఇన్నిన్ని తప్పులు చేస్తున్నారు..? మీరు ప్రజాప్రతినిధులు అనుకుంటున్నారా..? లేకుంటే మరేంటి..? అని ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించి మరీ గట్టిగానే ఇచ్చిపడేశారు. ఐతే ఆ ముగ్గురు ఎవరు అనేది బయటికి పేర్లు రాలేదు కానీ సమావేశంలో ఇలా జరిగిందనే విషయం మాత్రం వెలుగులోకి వచ్చింది.
ఎవరా ముగ్గురు..?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఉండగా మరొకరు ఫస్ట్ టైం గెలిచిన వ్యక్తి ఉన్నారట. ఒకరు కడపకు చెందిన ఎమ్మెల్యే.. మరొకరు గుంటూరుకు చెందిన ఎమ్మెల్యే.. ఇంకొకరు తిరుపతి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే. ఈ ముగ్గురు ఈ మధ్య ఎక్కడ చూసినా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నవారే కావడం గమనార్హం. ఒకరేమో చెత్త వివాదం.. మరో ఎమ్మెల్యే భర్త రియల్ ఎస్టేట్ వ్యవహారంలో...ఇంకొకరు ఇసుక విషయంలో వార్తల్లో నిలిచిన వారు అని తెలిసింది. మరోవైపు.. కొందరు మంత్రులకు కూడా క్లాస్ తీసుకున్న చంద్రబాబు.. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని మరీ చెప్పారని తెలియవచ్చింది. ఇకపైన మంత్రులు జాగ్రత్తగా ఉండి.. మీ మీ జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, నాయకులను గైడ్ చేయాలనీ.. మళ్లీ మళ్లీ ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని.. చివరిగా చెప్పిన చంద్రబాబు కేబినెట్ సమావేశం ముగించారట. మరి ఆ ముగ్గురు ఎమ్మేల్యేలు, మంత్రులు ఇకనైనా మారి మంచిగా ఉంటారో.. లేదంటే పదవులు పోగొట్టుకుంటారో చూడాలి మరి.