పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ ఓ సినిమాని రీమేక్ చేస్తున్నాడు అనగానే పవన్ కళ్యాణ్ అభిమానులు హరీష్ శంకర్ ని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు. కానీ హరీష్ శంకర్ వారిని అన్ ఫాలో చేస్తూ వారికి గట్టిగానే కౌంటర్లు ఇచ్చాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ని సెట్స్ మీదకి తీసుకెళ్లిపోయారు.
అంతేనా పవన్ తో పది రోజుల షూట్ చేసి ఆ కంటెంట్ తో పవన్ ఫ్యాన్స్ నోరు మూయించాడు. పవన్ కళ్యాణ్ పోలీస్ లుక్, అలాగే పవర్ ఫుల్ కేరెక్టర్, ఆ లుక్స్ అన్ని సినిమాపై కాదు కాదు హరీష్ శంకర్ పై నమ్మకం కలిగేలా చేసాయి. అంతా బాగానే ఉంది. మధ్యలో మిస్టర్ బచ్చన్ హరీష్ శంకర్ ను పవన్ ఫ్యాన్స్ ముందు అడ్డంగా బుక్ అయ్యేలా చేసింది.
రవితేజ-హరిష్ శంకర్ ల మిస్టర్ బచ్చన్ మరీ అంత బ్యాడ్ కాకపోయినా హరిష్ శంకర్ నోటి దూల సినిమాని డిసాస్టర్ దిశగా పరుగులు పెడుతుంది. మిస్టర్ బచ్చన్ కూడా బాలీవుడ్ రైడ్ మూవీకి రీమేక్. అయినా తెలుగులోకి వచ్చేసరికి హరీష్ శంకర్ చాలానే మార్చేసాడు. కానీ వర్కౌట్ అవలేదు. త్వరలోనే ఉస్తాద్ సెట్స్ పైకి వస్తుంది.
హరీష్ శంకర్ గనక ఉస్తాద్ ని సరిగ్గా హ్యాండిల్ చెయ్యలేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి ఆయన్ని ఎవరూ కాపాడలేరు, మరి హరీష్ శంకర్ ని ఆ దేవుడే కాపాలి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేగా.. అంతేగా..