Advertisement
Google Ads BL

బిగ్ బాస్ అవకాశం దక్కించుకున్న అర్జున్


బిగ్ బాస్ సీజన్ 8 మొదలు కావడానికి మరెంతో సమయం లేదు. ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు బిగ్ బాస్ 8 ఓపెనింగ్ ఎపిసోడ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసింది. నాగార్జున హోస్ట్ గా రాబోతున్న సీజన్ 8 ఎలా ఉండబోతుంది, ఫైనల్ లిస్ట్ లో ఎవరు ఉంటారనే విషయం లో కాస్త సస్పెన్స్ నడుస్తుంది. కారణం బిగ్ బాస్ యాజమాన్యం ఫైనల్ లిస్ట్ విషయంలో ఏదో సీక్రెట్ మైంటైన్ చేస్తుంది.

Advertisement
CJ Advs

ఇక బిగ్ బాస్ సీజన్ మొదలయ్యాక వారం వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ బజ్ అంటూ ఓ యాంకర్ ని పెట్టి ఇంటర్వూస్ చేపిస్తుంది స్టార్ మా. అందులో అంటే బిగ్ బాస్ బజ్ లో ఆ ముందు సీజన్ విన్నర్ కానీ, రన్నర్ ని యాంకర్ గా చేసి ఇంటర్వూస్ చేపిస్తారు. ఆలా రాహుల్ సిప్లిగంజ్, గీతూ రాయల్ ఇలా చాలామంది బిగ్ బాస్ బజ్ లో యాంకరింగ్ చేసారు.

మరి వీకెండ్ లో నాగార్జున క్లాస్ ల కన్నా ఎక్కువగా బిగ్ బాస్ బజ్ లో చేసే ఇంటర్వ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ బయటికి వస్తాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ నుంచి రకరకాల ప్రశ్నలతో ఇంట్రెస్ట్ కలిగిస్తారు. అయితే ఈ సీజన్ మొదలయ్యాక బిగ్ బాస్ బజ్ లో అర్జున్ అంబటిని యాంకర్ గా తేబోతున్నారట.

అర్జున్ గత సీజన్ విన్నర్ కాదు, రన్నర్ కాదు. గత సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన అర్జున్ అంబటి  షోలో ఎంటర్టైన్మెంట్, ప్రతి గేమ్ లో అదిరిపోయే పెరఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అందుకే ఈ సీజన్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేసే అవకాశం అమర్ కి కానీ, శివాజీ కి కానీ రాకుండా అర్జున్ అంబటికి దక్కింది. 

Arjun got the opportunity of Bigg Boss:

Arjun Ambati is going to be anchored in Bigg Boss Buzz
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs