శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత మొట్ట మొదటిసారి నాగ చైతన్య మీడియా ముందుకు వచ్చాడు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వచ్చిన చైతూని మీడియా వదులుతుందా.. నిన్నగాక మొన్న నాగార్జున N కన్వెన్షన్ ని హైడ్రా కూల్చివేతపై అలాగే శోభిత దూళిపాళ్లతో పెళ్లిపై మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది.
నాగ చైతన్య మాత్రం కూల్ గా హడావిడి లేకుండా N కన్వెన్షన్ పై నాన్న సోషల్ మీడియాలో ట్వీట్ వేశారు. ఇంక దానిపై మాట్లాడడానికి ఏమి లేదు. ఇక శోభిత తో పెళ్లి విషయమై చైతూని మీడియా పెళ్లి ఎప్పుడు, అది హైదరాబాద్ లోనా, లేదంటే డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఉండబోతుందా అంటూ నాగ చైతన్య ని అడిగింది మీడియా.
దానికి చైతు.. పెళ్లంటే నా మనసుకు దగ్గరైన వాళ్లంతా ఉండాలి, మన సంస్కృతి , సాంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం, పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనేదానిపై త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని అంటూ చైతు పెళ్లి ఎప్పుడు అనే విషయాన్ని చెప్పకుండానే దాటవేశాడు.