నిన్న సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మాజీ ఎమ్యెల్యే రోజా పార్టీ జెండాలను, అన్న జగన్ ఫోటోలను పీకి పారేసిన విషయం హాట్ టాపిక్ అయ్యింది. ఎక్స్ ఎమ్యెల్యే, ఎక్స్ మినిస్టర్ అన్న పదాలను ఉంచి వైసీపీ పార్టీ లోగో, జగన్ బొమ్మలు అన్ని తీసేసిన రోజా వైసీపీ పార్టీని జగన్ అన్నతో అనుబంధాన్ని వదిలించుకుంది, ఓడిపోయాక అసలు రంగు బయటపెట్టింది అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది.
నిన్న అలా కనిపించిన రోజా సోషల్ మీడియా హ్యాండిల్ లో ఈ రోజు అన్నా- వదినా అంటూ జగన్-భారతీ లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపడం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏళ్ళన్నీ గడచినా చెదరని మీ అనుబంధం.. ఇలాగే కలకాలం సాగాలని ఆశిస్తూ.!! అన్నా వదినలకి హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు 💞 #weddinganniversary.
జగన్-భారతిల పిక్ పెట్టి మరీ రోజా జగన్ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. మరి రోజా నిన్న అలా ఈరోజు ఇలా ఇదే వైసీపీ కార్యకర్తలకు అంతుబట్టడం లేదు. రోజా ఇక్కడ వైసీపీ ని వదిలి తమిళ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్న తరుణంలోనే వైసీపీ లోగోలను, జగన్ పిక్స్ ని సోషల్ మీడియా నుంచి తొలిగించింది అనే టాక్ ఉంది.