Advertisement

రేవంత్‌- నాగ్‌ మధ్య 100 కోట్ల గొడవ?


రేవంత్‌- నాగ్‌ మధ్య ఉన్న గొడవేంటి?

Advertisement

హైదరాబాద్‌లో వందలాది మంది రాజకీయ, సినీ ప్రముఖులు, బిజినెస్‌మెన్లు ఉండగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జుననే రేవంత్ సర్కార్ ఎందుకు టార్గెట్ చేసింది..? సీఎం రేవంత్ రెడ్డి-నాగ్ మధ్య ఉన్న గొడవేంటి..? ఎన్-కన్వెన్షన్ కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా లేఖ రాయడమేంటి..? వీటన్నింటికీ వెనుక ఉన్న ఆంతర్యమేంటి..? ఇవే ఇప్పుడు సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ తొలుస్తున్న ప్రశ్నలు. నెట్టింట్లో.. కాంగ్రెస్, అక్కినేని వర్గాల్లో నడుస్తున్న చర్చేంటి..? అనే ఇంట్రెస్టింగ్ తెలుసుకుందామా.. ఇంకెందుకు ఆలస్యం చకచకా చదివేయండి మరి..!

వాళ్ల సంగతేంటి..?

హైడ్రా.. ఇప్పుడీ పేరు వింటే చాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..! ఎప్పుడు తమ ఇంటిపైకి బుల్డోజర్ వచ్చి పడుతుందో తెలియక కబ్జాదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి. నాగార్జునకు చెందిన ఎన్- కన్వెన్షన్‌ను నేలమట్టం చూశాక ఎవరి నోట చూసినా.. ఎక్కడ చూసినా ఇదే మాట. వాస్తవానికి ఎన్- కన్వెన్షన్‌పై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. టీడీపీలో ఉన్నప్పట్నుంచీ అది అక్రమమే, కూల్చాల్సిందే అని పట్టుబడుతూనే వస్తున్నారు. అయితే అదే ఫంక్షన్‌ హాలులో కుమార్తె నిశ్చితార్థం, పెళ్లి చేసిన రేవంత్ రెడ్డి.. ఇక అన్నీ మరిచిపోయారనుకున్నారు కానీ.. కూల్చివేత దాకా వచ్చింది. పోనీ.. హైదరాబాద్‌లో.. చుట్టు పక్కల ఎంత మంది సెలబ్రిటీల ఇళ్లు ఉన్నాయ్..? ప్రస్తుతం రేవంత్ కేబినెట్‌లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, బడా బాబుల ఇండ్లు లేవా..? అంటే లెక్కలేనన్ని ఉన్నాయ్. అలాంటిది అవన్నీ వదిలేసి నాగార్జుననే టార్గెట్ చేయడమేంటి..? అనేది సర్వసాధారణంగా అందరికీ వచ్చే ప్రశ్నే.

ఇదీ అసలు సంగతి!

నాగ్-రేవంత్ మధ్య గొడవలు ఇప్పటివి కాదట.. అనేది నెట్టింట్లో నడుస్తున్న పెద్ద చర్చ. నాడు అన్నపూర్ణ స్టూడియోను టచ్ చేయగా కోర్టులకు వెళ్తే న్యాయం గెలిచిందని.. ఇప్పుడు న్యాయం గెలుస్తుందని అక్కినేని అభిమానులు చెప్పుకుంటున్నారు. కానీ.. వాస్తవానికి ఎన్-కన్వెన్షన్ ద్వారా నాగార్జునకు ఏటా 100 కోట్లపైగానే టర్నోవర్ జరుగుతుందన్నది బయట టాక్. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ ఫండ్‌కు గాను 100 కోట్లు ఇవ్వాలని కోమటిరెడ్డి ద్వారా రేవంత్ రెడ్డి కబురు పంపారట. ఎందుకివ్వాలి..? నాకేం అవసరం..? అని నాగ్ బదులిచ్చారట. ఇక్కడే అసలు సిసలైన గొడవ షురూ అయ్యిందట. అందుకే ఎక్కడ దొరుకుతాడా..? అని చూసి అక్కినేనిని గట్టి దెబ్బ కొట్టారట రేవంత్. మరోవైపు.. ఎన్-కన్వెన్షన్‌ను హైదరాబాద్‌లోనే అత్యంత సుందరంగా విల్లాలు నిర్మించాలని నాగ్ ప్లాన్ చేశాడట. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పార్ట్‌నర్ కాబోతున్నారని తెలిసింది.. అందుకే ఆదిలోనే అంతం చేయాలని.. అక్కినేనిని కొడితే కేటీఆర్‌ను కొట్టినట్లే అని రేవంత్ పక్కా ప్లాన్‌తో దెబ్బకొట్టాడట.

భయం.. భయం..!

హైడ్రా దెబ్బ పెద్ద తలకాయ పడితేగానీ.. మిగిలిన వాళ్లలో భయం ఆటోమాటిక్‌గా మొదలవుతుందని భావించిన రేవంత్ రెడ్డి.. నాగ్‌ను టచ్ చేశారనే చర్చ మరోవైపు గట్టిగానే నడుస్తోంది. దీనికి తోడు రియల్ ఎస్టేట్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన సీఎంకు అన్నీ తెలుసని నిబంధనల ప్రకారమే అన్ని చర్యలు తీసుకున్నారనే చర్చ సైతం మొదలైంది. పోనీ.. చెరువును ఆక్రమించలేదు అనడానికి లేదు. మూడు ఎకరాలు తుమ్మడికుంట చెరువును ఆక్రమించారన్నది ఇప్పట్నుంచి నడుస్తున్న ఆరోపణ కాదు. వైఎస్సార్, చంద్రబాబు, కేసీఆర్‌లు సీఎంలుగా ఉన్నప్పట్నుంచీ నడుస్తున్నదే. అందుకే.. నాగ్‌ను పెద్ద తలకాయగా భావించిన రేవంత్ ఇలా దెబ్బ కొట్టారట. దీంతో అటు సినిమా.. ఇటు పాలిటిక్స్‌లోని బడాబాబులు, అక్రమార్కులు షేక్ అవుతారని హైడ్రాకు పనిబెట్టారన్నది తాజాగా నడుస్తున్న చర్చ. ఇక రేపో మాపో జన్వాడలోని కేటీఆర్ ఫాం హౌస్ కూడా కుప్ప కూల్చబోతున్నారని టాక్ నడుస్తోంది. చూశారుగా.. సోషల్ మీడియా వేదికగా ఎలాంటి చిత్ర విచిత్రాలు నడుస్తున్నాయో.. ఇందులో నిజమెంతో.. అసలు సంగతేంటో నాగార్జునకే తెలియాలి మరి.

100 crore fight between Revanth and Nag?:

What is the quarrel between Revanth and Nag?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement