గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన దేవర రావడానికి ఇంకా 30 రోజుల సమయమే ఉంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాబోతున్న దేవర పై అంచనాలు భీభత్సంగా ఉన్నాయి. సెప్టెంబర్ 27 న అంటే మరొక్క నెల మాత్రమే ఉంది దేవర హంగామా స్టార్ట్ అవడానికి. మళ్ళీ ఇదే రోజు దేవర జాతరతో సోషల్ మీడియా మాత్రమే కాదు, అభిమానులు ఎన్టీఆర్ ఫ్లేక్సీలు, దేవర బ్యానర్ల తో నిండిపోవడం ఖాయం.
ఈ నెల రోజుల్లో దేవర ప్రమోషన్స్ తో టీమ్ హడావిడిగా ఉంటే ఆ ప్రమోషనల్ ఈవెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత రచ్చ చేస్తారు. దేవర బెన్ఫిట్ షోస్, స్పెషల్ షోస్, ఓవర్సీస్ ప్రీమియర్స్, ఫస్ట్ డే టాక్, మొదటిరోజు కలెక్షన్స్ అంటూ ఆ హంగామా ఊహించుకుంటే ఎన్టీఆర్ అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి.
తాజాగా భయానికి భయం కలిగించే దేవర అంటూ దేవర లో ఎన్టీఆర్ పోస్టర్ వదిలారు మేకర్స్. ఇక ఈనెల రోజుల్లో దేవర ట్రైలర్, ఇంకా పాన్ ఇండియా ప్రమోషన్స్ తో చిత్రం బృందం హడావిడి, సోషల్ మీడియాలో దేవర టాక్ అంటూ సెప్టెంబర్ 27 న జాతర చూసేందుకు కామన్ ఆడియన్స్ అంతా సిద్ధమవుతున్నారు.