Advertisement
Google Ads BL

నాగ్ బిగ్ బాస్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో?


నాగార్జున హైదరాబాద్ మాదాపూర్ లో నిర్మించిన N కన్వెన్షన్ ని తెలంగాణ ప్రభుత్వం నిభందనలకు విరుద్ధంగా నిర్మించారు, చెరువును కబ్జా చేసారు, అది అక్రమ కట్టడమంటూ కూలదోయించిన ఘటన సంచలనం సృష్టించింది. గత పదేళ్లుగా నాగార్జున N కన్వెన్షన్ ని కూలదోయ్యకుండా హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. 

Advertisement
CJ Advs

కానీ ఈ ప్రభుత్వం హైడ్రా పేరుతొ అక్రమ భవనాలను లేకుండా చేసే పనిలో భాగంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న N కన్వెన్షన్ ని పడగొట్టడంతో నాగార్జున హుటాహుటిన కోర్టుకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా స్టే తెచ్చుకోవడమే కాదు.. తాను ఏ చెరువును ఆక్రమించలేదు, ఒక్క సెంటు కూడా నేను ఆక్రమించలేదు, సక్రమంగానే ఈ భవనాన్ని నిర్మించానని ప్రెస్ నోట్ విడుదల చేసారు.  

ప్రస్తుతం అంత టెన్షన్ లో ఉన్న నాగార్జున రేపు శనివారం షూట్ చెయ్యబోయే బిగ్ బస్ సీజన్ 8 ని ఎలా హ్యాండిల్ చేస్తారో అంటూ అయన అభిమానులు మధనపడుతున్నారు. ఓ పక్క N కన్వెన్షన్ టెన్షన్ తో నాగర్జున స్టేజ్ పై ఎలా కనిపిస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. శని, ఆదివారాల్లో బిగ్ బాస్ సీజన్ 8 ని గ్రాండ్ గా మొదలు పెట్టేందుకు యాజమాన్యం షూట్ కి సిద్దమవుతుంది. 

ఆదివారం రాత్రి 7 గంటల నుంచి సీజన్ 8 స్టార్ మా లో ప్రసారం కాబోతుంది. మరి నాగ్ ఈ ఓపెనింగ్ ఎపిసోడ్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూద్దాం.                         

 

Nag Under Stress: Can He Handle Bigg Boss?:

Bigg Boss Telugu 8 - Grand Launch Starting from Sep 1st 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs