Advertisement
Google Ads BL

అక్టోబర్ 10 నుంచి వెనక్కి వెళుతున్న సూర్య ?


తమిళనాట రిలీజ్ డేట్ కొట్లాట మొదలయ్యింది. దసరా స్పెషల్ గా సూర్య పాన్ ఇండియన్ ఫిలిం కంగువ విడుదల అంటూ మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అక్టోబర్ 10 న సూర్య-శివ కాంబోలో వస్తోన్న కంగువ విడుదల కాబోతున్నట్లుగా ప్రకటించారు. అదే రోజు అంటే అదే అక్టోబర్ 10 న రజనీకాంత్ వెట్టయన్ విడుదల అంటూ ఆ మేకర్స్ డేట్ అనౌన్స్ చేసారు.

Advertisement
CJ Advs

కంగువ చిత్రం ఇప్పటికే రెండుసార్లు అనధికారికంగా వాయిదాపడి.. అక్టోబర్ 10కి విడుదలవుతున్నట్లు ఈమధ్యనే ప్రకటించారు మేకర్స్. రజిని సినిమా రేస్ లోకి వచ్చినా దసరా సెలవులు కాబట్టి రెండు సినిమాలకు థియేటర్లు సరిపోతాయి అనుకున్నారు ట్రేడ్ వర్గాలు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ సమాచారం మేరకు కంగువ చిత్రం అనుకున్నట్లుగా అక్టోబర్ 10కి విడుదలవ్వడం లేదని తెలుస్తోంది.

కంగువ చిత్రం రజినీకాంత్ వెట్టియాన్ కోసం పోస్ట్ పోన్ అవ్వడం లేదు అని, కంగువ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్నంత వేగంగా పూర్తవ్వకపోవడం, అవుట్ పుట్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సి రావడంతో దర్శకనిర్మాతలు ఈ చిత్రాన్ని దసరా పండుగకి కాకుండా.. దివాళి కి విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా టాక్. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Suriya Kanguva Postponed?:

Kanguva is not releasing on October 10 as planned
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs