Advertisement
Google Ads BL

పెళ్లి పీటలెక్కిన అమీ జాక్సన్


గతంలో అంటే కరోనాకు ముందు జార్జ్‌ పనియోటౌ అనే బిజినెస్‌మెన్ తో ప్రేమాయణం నడిపిన అమీ జాక్సన్ ఆ తర్వాత అతన్ని పెళ్లి కూడా చేసుకుందామనుకుంది. అంతలోనే ఓ బాబు కి జన్మనిచ్చింది. ఆ తర్వాత జార్జ్‌ పనియోటౌ తో అమీ జాక్సన్ కి మనస్పర్ధలు రావడంతో బాబుతో పాటుగా సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తున్న అమీ జాక్సన్ 2022లో మరోసారి ప్రేమలో పడింది. 

Advertisement
CJ Advs

హాలీవుడ్‌ యాక్టర్ ఎడ్‌ వెస్ట్‌విక్‌, అమీ జాక్స‌న్ కొంతకాలంగా రిలేష‌న్‌షిప్‌లో ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి పీటలెక్కారు. ఈ ఆదివారం అమీ జాక్సన్ - ఎడ్‌ వెస్ట్‌విక్‌ ఇటలీ వేదికగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గతేడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని జిస్టాడ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వీరిరువురు ఈ ఏడాది ఆగష్టు 25 న పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. 

రీసెంట్ గా అమీ జాక్సన్ పెళ్లి కోసం తన కొడుకుతో ఎడ్‌ వెస్ట్‌విక్‌తో పాటుగా ఇటలీ వెళుతుండగా.. విమానంలోని పిక్స్ ని షేర్ చేస్తూ.. పెళ్లి చేసుకుందాం బేబీ అంటూ క్యాప్షన్ పెట్టింది. రెండు రోజులక్రితం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో ఈ జంట పాల్గొంది. నిన్న ఆదివారం ఇట‌లీలో కుటుంబ సభ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వీరిద్ద‌రూ ఎంతో ఘ‌నంగా పెళ్లిచేసుకున్నారు. 

తమ పెళ్లి ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది అంటూ అమీ జాక్సన్ అలాగే ఎడ్‌ వెస్ట్‌విక్‌ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 

Amy Jackson And Ed Westwick Are Now Married:

Amy Jackson and Ed Westwick are all set to marry in Italy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs