హీరో నాని సినిమాని ఎంతగా ప్రేమిస్తాడో.. అంతే కష్టపడి సినిమాని పూర్తి చేస్తాడు. అంతేకాదు ప్రమోషన్స్ విషయం లోను నాని మేకర్స్ తో కలిసి ప్రత్యేకంగా ప్రాణం పెట్టి పని చేస్తాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్, దసరా, హాయ్ నాన్న, అంటే సుందరానికి ఇవన్నీ నాని పాన్ ఇండియా మార్కెట్ లో కూడా ప్రమోట్ చేస్తూ పాన్ ఇండియా ఆడియన్స్ కి దగ్గరయ్యే ప్లాన్ చేసాడు.
దసరా సినిమా కు అంతో ఇంతో నానికి వర్కౌట్ అయినా మిగతా సినిమాలను పాన్ ఇండియా ప్రేక్షకులు పట్టించుకోలేదు. ప్రతి సినిమాకు నాని హీరోయిన్, దర్శకుడితో కలిసి చెన్నై, బెంగుళూరు కొచ్చి అంటూ ప్రమోషన్స్ చేసాడు. కానీ అంతగా నానిని పాన్ ఇండియా ఆడియన్స్ అక్కున చేర్చుకోలేదు.
ఇప్పుడు దానయ్య నిర్మాణంలో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా నాని-ప్రియాంక మోహన్ నటించిన సరిపోదా శనివారం చిత్రం వచ్చే శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ చిత్రంపై నాని చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. హీరోయిన్ ప్రియాంక తో కలిసి నాని ముంబై, చెన్నై, బెంగుళూరు అంటూ ప్రమోషన్స్ చేస్తూ కష్టపడుతున్నాడు.
పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా సరిపోదా శనివారాన్ని నాని ప్రమోట్ చేస్తున్నాడు. మరి ఈసారైనా హీరో నాని పాన్ ఇండియా మార్కెట్ లో పడిన కష్టానికి ఫలితం దక్కుతుందా, శనివారాన్ని ఇతర భాషల ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.