కోలీవుడ్ నటి మేఘా ఆకాష్ టాలీవుడ్ లో చేసిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ నిరాశ పరచడంతో కోలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. కోలీవుడ్ లోను మేఘా ఆకాష్ కి ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేకపోవడంతో ప్రస్తుతం కెరీర్ లో డల్ గా కనిపిస్తుంది. రీసెంట్ గా ఆమె విజయ్ ఆంటోనీతో నటించిన తుఫాన్ కూడా ఆమెని నిరాశపరిచింది. దానితో ఆమె పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది.
తాజాగా అంటే ఆగస్టు 22 న ప్రియుడు సాయి కిరణ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఆమె పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టించేసినట్లుగా తెలుస్తుంది. కారణం ఆమె తన పెళ్ళికి రావాలని సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటికి వెళ్లి ఆహ్వానించిన విషయం ఫొటోస్ రూపంలో షేర్ చేసింది.
మేఘ ఆకాష్ తనకి తలైవా అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు ఆమె తనకి కాబోయే భర్త సాయి కిరణ్ తో, అలాగే తన ఫ్యామిలీతో సహా రజినీకాంత్ ఇంటికి వెళ్లి మరీ తన పెళ్ళికి ఆహ్వానించింది. అదే విషయాన్ని చెబుతూ నా పెళ్ళికి రావాల్సిందిగా అభిమానంతో తలైవాను ఆహ్వానించాను అంటూ సోషల్ మీడియాలో అందరితో పంచుకుంది మేఘ ఆకాష్.