Advertisement
Google Ads BL

N నేలమట్టం.. టీడీపీ ట్రస్ట్ కథేంటి రేవంత్!


N నేలమట్టం.. టీడీపీ ట్రస్ట్ కథేంటి రేవంత్!

Advertisement
CJ Advs

టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌ను హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్) నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ వ్యవహారమే అటు టాలీవుడ్‌లో ఇటు తెలుగు రాష్ట్రాల్లో బర్నింగ్ టాపిక్ అయ్యింది. మూడున్నర ఎకరాల తుమ్మడి చెరువును కబ్జాచేసి కన్వెన్షన్‌ను నిర్మించారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ భారీ బందోబస్తు మధ్య కూల్చేశారు. హైకోర్టును ఆశ్రయించిన నాగార్జునకు ఊరట లభించింది కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందులో ఇంచు కూడా ఆక్రమించిన భూమి లేదని నాగార్జున నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే స్టే వచ్చింది.. రేపొద్దున్న ఏం జరుగుతుందనేది తెలియట్లేదు. ఇక ఇది కాస్త పక్కనెడితే ఈ కూల్చివేత తర్వాత కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

నాడు.. నేడు!

అసెంబ్లీ వేదికగా.. అసెంబ్లీ బయట రేవంత్ రెడ్డి నాడు మాట్లాడిన విషయాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పదే పదే చెప్పినా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా.. నాగార్జున-కేటీఆర్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలతో టచ్ చేయలేదన్నది పెద్ద ఆరోపణ. నాడు చెప్పినట్లుగానే కుప్పకూల్చేశారు కానీ.. ఇదే కన్వెన్షన్ సెంటర్‌లో తన కుమార్తె నిశ్చితార్థం జరిపిన విషయాన్ని కూడా జనాలు రేవంత్ రెడ్డికి గుర్తు చేస్తున్నారు. నాడు నిశ్చితార్థం నేడు నేల మట్టమా..? ఇదేం విచిత్రం బాబోయ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే.. కాంగ్రెస్ హయాంలోనే ఈ నిర్మాణం జరిగిందని కొందరు అంటుంటే.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ప్రస్తుత సీఎం నారా చంద్రబాబుతో మంచిగా ఉంటూనే అక్కినేని ఫ్యామిలీ ఇదంతా చేసిందన్నది ఎప్పట్నుంచో ఆరోపణలు ఉన్నాయి.  2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వే చేస్తే నాగార్జున హై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్న విషయం కూడా బయటికొచ్చింది. నాడు అనుమతులు ఇచ్చిన కాంగ్రెస్సే.. నేడు కూల్చివేయడం ఏంటి..? అని నాగ్ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ట్రస్ట్‌ను టచ్ చేస్తారా..?

హైదరాబాద్ గండిపేట చెరువులో టీడీపీ ట్రస్ట్‌కు చెందిన ఎన్టీఆర్ కాలేజీ నిర్మాణం ఉంది. దీనిపైన చర్యలు తీసుకునే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా..? ఒకవేళ టచ్ చేస్తానంటూ ఏపీ సీఎం చంద్రబాబు చూస్తూ ఊరుకుంటారా..? ఒప్పుకుంటారా? అనే ప్రశ్నలు సర్వత్రా వస్తున్నాయి. అసలు టచ్ చేసే సాహసం సీఎం చేస్తారా..? చేయరా అని నెట్టింట్లో పోల్స్ పెడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఎన్ చెరువును ఆక్రమించి కట్టినది కూల్చేశారు సరే.. టీడీపీ ట్రస్ట్ కథేంటి..? ఎప్పుడు కూలుస్తున్నారు..? హైడ్రా ఎప్పుడు రంగంలోకి దిగుతోంది..? అనేదానిపై కాస్త సెలవిస్తే మంచిది సీఎం సార్ అంటూ నెటిజన్లు, సామాన్య ప్రజలు కోరుతున్నారు. ప్రజా పాలనలో అక్రమ కట్టడాలను అడ్డంగా తొలగిస్తున్నారు సరే.. ఇది అన్నిటికీ వర్తించాలి కదా..? అనే డిమాండ్ వస్తోంది.. రేవంత్ ఏం చేయబోతున్నారో చూడాలి మరి.

బీఆర్ఎస్ ఇలా..!

ఇది హైడ్రా కాదు.. రేవంత్ రాజకీయ హైడ్రామా అంటూ బీఆర్ఎస్ తిట్టి పోస్తోంది. రేవంత్ పెట్టిన హైడ్రా అసలు ఉద్దేశం అక్రమ కట్టడాల తొలగింపు కాదని.. కేవలం రాజకీయ ప్రత్యర్ధుల మీద కక్ష సాధింపు అని గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బెదిరించి వసూళ్ళు చేయడం కోసమే అని నెల రోజుల దాని పనితీరు చూసిన వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారనపి బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. హైడ్రా.. అంతా మా ఇష్టం అన్నట్టు సర్కారు వ్యవహారం అని.. హైడ్రా పరిధి, కూల్చివేతలపై ఎన్నెన్నో సందేహాలు వస్తున్నాయని.. కొన్నింటిని వదిలి, కొన్నింటినే కొట్టి.. ఇదీ హైడ్రా పని విమర్శలూ వస్తున్నాయి. తన పరిధిలో లేని మూడు గ్రామాల్లోనూ కూల్చుడు ఇదేనా హైడ్రా పని అంటూ బీఆర్ఎస్‌కు చెందిన మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయ్..!

What is the story of TDP Trust Revanth!:

BRS is cursing Revanth as a political hydra
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs