Advertisement
Google Ads BL

మెగాస్టార్ కి దర్శకులు కరువయ్యారు!


మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తర్వాత బింబిసార దర్శకుడు వసిష్ఠ తో విశ్వంభర అనే మైథలాజికల్ మూవీని చేస్తున్నారు. జనవరి 10 సంక్రాంతి టార్గెట్ గా వస్తున్న విశ్వంభర నుంచి మెగాస్టార్ ఫస్ట్ లుక్ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 22 న విడుదల చెయ్యగా, అది మెగా ఫ్యాన్స్ ని బాగా ఇంప్రెస్ చేసింది.

Advertisement
CJ Advs

విశ్వంభర తర్వాత మెగాస్టార్ చెయ్యబోయే సినిమాపై ఏడాదిగా సస్పెన్స్ నడుస్తుంది. తన కుమర్తె సుస్మిత నిర్మాణ సారథ్యంలో మెగాస్టర్ చెయ్యబోయే నెక్స్ట్ మూవీకి దర్శకుడు సెట్ అవడం లేదు. గత ఏడాదే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్సమెంట్ ఇచ్చినా డైరెక్టర్ పేరు వెయ్యలేదు. ఇప్పటికే మచ్చ రవి కథతో చిరు ని ఓకె అనిపించేసాడు.

ఈమధ్యన చిరుతో గాడ్ ఫాదర్ ని డైరెక్ట్ చేసిన మోహన్ రాజా తో చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది అనే ప్రచారం జరిగినా.. ప్రస్తుతం చిరు ఏ దర్శకుడితో కమిట్ అవ్వకపోవడం వలనే ఆయన బర్త్ డే రోజు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదని అంటున్నారు. చిరు అండ్ టీమ్ ఇప్పుడు దర్శకుడిని వెతికే పనిలో పడ్డారట.

ఈ చిత్రాన్ని కూడా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి మెగాస్టార్ ని మాస్ గా చూపించబోయే ఆ డైరెక్టర్ అనేది కాస్త వేచి చూడాల్సిందే.!  

Megastar is short of directors!:

Chiranjeevi is not committed to any director for his next movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs