Advertisement
Google Ads BL

సౌత్ vs నార్త్ వద్దు : నాగ్ అశ్విన్


ప్రస్తుతం సౌత్ సినిమాలు, నార్త్ సినిమాలనే భాషా భేదం లేకుండా అంతా ఇండియన్ సినిమాగా వెలుగొందుతుంది. పాన్ ఇండియా మూవీస్ తో సౌత్ హీరోలు బాలీవుడ్ లో దున్నేస్తున్నారు. హిందీ హీరోలు సౌత్ ని రాఫ్ఫాడిస్తున్నారు. సో భాషా భేదం లేకుండా ఆడియన్స్ అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు. కానీ నార్త్ లో కొంతమంది నటులు సౌత్ హీరోలపై ఈగో చూపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి చిత్రంలో జోకర్ లా ఉన్నాడంటూ అర్షద్ వర్సి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు భగ్గుమన్నారు. అంతేకాదు హీరో నాని, సిద్దు జొన్నలగడ్డ, శర్వానంద్, మా అధ్యక్షుడు మంచు విష్ణు లాంటి వాళ్ళు ఈ జోకర్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నార్త్ నటులపై కోపంగా ఉన్నారు. 

అందులో ఓ అభిమాని కల్కి చిత్రంలో ప్రభాస్ కర్ణుడిగా ఎంట్రీ ఇచ్చే సీన్ ని పోస్ట్ చేస్తూ.. బాలీవుడ్ కంటే మొత్తం ఇది చాలా బెటర్ అంటూ ట్వీట్ చేసాడు. అది చూసిన కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ మళ్ళీ పాత కాలంలోకి వెళ్లొద్దు. బాలీవుడ్ vs టాలీవుడ్  అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీనే. అర్షద్ సాబ్ మీరు కొద్దిగా చూసుకుని మట్లాడాల్సింది. 

మీ నలుగురు పిల్లలకు బుజ్జి బొమ్మలు పంపిస్తున్నాను, కల్కి 2 లో ప్రభాస్ ని బెస్ట్ గా చూస్తారు అంటూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. అంతేకాదు ప్రపంచం మొత్తం ద్వేషంతో నిండిపోయింది. దానిని పెంచే ప్రయత్నం చెయ్యొద్దు, నేను మాత్రమే కాదు ప్రభాస్ కూడా ఇలానే ఫీలవుతారు అంటూ నాగ్ అశ్విన్ ప్రభాస్ అభిమానుల ద్వేషాన్ని తగ్గించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. 

Nag Ashwin on Arshad Warsi comments on Kalki 2898 AD:

Nag Ashwin reactsto Arshad Warsi comments on Prabhas look in Kalki 2898AD
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs