తెలుగమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా హీరోయిన్స్ గా రాణించలేరు అనే విషయం కొంతమంది దగ్గర ప్రూవయితే మరికొంతమంది అమ్మాయిలు మాత్రం అవకాశాలు అందిపుచ్చుకుంటూనే కెరీర్ లో కొనసాగుతున్నారు. బ్లాక్ బస్టర్ లేకపోయినా, స్టార్ హీరోల అవకాశాలు అందకపోయినా వెనక్కి తగ్గడంలేదు, ఖాళీగా ఉండడం లేదు.
ఈలిస్ట్ లో మాత్రం ఈషా రెబ్బ పేరు ముందు వరసలో ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా మలుచుకుంటున్న ఈ భామ తనకి స్టార్ హీరో అవకాశాలను వస్తాయని, యంగ్ హీరోలు ఆఫర్స్ ఇస్తారని ఎదురు చూస్తూ కూర్చోలేదు, చిన్న, చితక, ఇలా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది, వెబ్ సీరీస్ లు చేస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈషా రెబ్బ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోస్ ని, ట్రెడిషనల్ లుక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈషా రెబ్బ లైట్ కలర్ మోడ్రెన్ వేర్ లో ట్రెండీ లుక్ వదిలింది. తన అందాన్ని సెల్ఫీ తీసుకుంటూ కనిపించిన పిక్స్ వైరల్ గా మారాయి.