Advertisement

అన్నయ్య మూవీతో హోం శాఖకు పవన్ దూరం!


రుద్రవీణ వల్లే పవన్ హోం శాఖకు దూరం!

Advertisement

హెడ్డింగ్ చూడగానే ఇదేంటి.. విడ్డూరంగా ఉందే అనుకుంటున్నారు కదా..! అబ్బే అదేమీ లేదండోయ్ ఈ మాటలు అన్నది ఎవరో కాదు స్వయానా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్. ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత సేనాని అభిమానులు మొదలుకుని ఆప్తులు, ఆత్మీయులు అందరూ ఆయన హోం శాఖ తీసుకుంటారని.. దీంతో పాటు కొన్ని కీలక శాఖలు తీసుకోవచ్చని భావించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. పలు సందర్భాల్లో పవన్ కూడా హోం శాఖపై తన అభిప్రాయం చెప్పుకుంటూనే వచ్చారు. అయితే.. ఎందుకు ఆ శాఖ జోలికి వెళ్లలేదు..? ఎందుకు పంచాయతీరాజ్ శాఖనే తీసుకున్నారనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

ఇదీ అసలు కథ..!

పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అన్నమయ్య జిల్లాలో పర్యటించిన మంత్రి పవన్.. సభలో కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా హోం శాఖ ప్రస్తావన వచ్చింది. తాను ఎందుకు ఆ శాఖ జోలికి వెళ్లలేదనే విషయం క్లారిటీ ఇస్తూ.. గూస్ బమ్స్ స్టేట్మెంట్ ఇచ్చారు పవన్. పవన్‌కు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ప్రేమ, గౌరవం అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన్ను ఎంతలా ప్రేమిస్తారో.. అంతకుమించి చిరు తీసే సినిమాలను కూడా ప్రేమిస్తారనే విషయం తాజాగా మెగాభిమానులకు తెలిసింది. హోం జోలికి పోకుండా పంచాయతీ శాఖ తీసుకోవడానికి ఒకే ఒక్క కారణం అన్నయ్య చిరంజీవి తీసిన రుద్రవీణ సినిమా అని బాంబ్ పేల్చారు. ఎందుకంటే.. ఆ సినిమా తనను ఎంతో ప్రభావితం చేసిందని.. ఒక సర్పంచ్ తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చన్న విషయం తెలిసిందన్నారు. 

అందుకే ఇలా..!

ఎన్నో కష్టాలు ఉన్న చిన్న ఊరిలో ఒక సర్పంచ్ తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయగలరని రుద్రవీణ ద్వారా తెలుసుకున్నానని పవన్ చెప్పుకొచ్చారు. ఒక దేశమే అతని వైపు చూసేలా చేయగలిగే శక్తి సర్పంచ్‌కు ఉంటుందని తెలిసేలా రుద్రవీణ చేసింది. అలా తీసిన ఈ సినిమా కారణంగా గ్రామాలని అభివృద్ధి చేస్తే దేశం ముందుకు వెళుతుందన్నారు. ఈ ఒక్క కారణంతోనే తాను హోమ్ మినిస్ట్రీ కాకుండా ఈ పంచాయతీరాజ్ శాఖని తీసుకున్నానని పవన్ కామెంట్స్ చెప్పుకొచ్చారు. తనకు సినిమాల కంటే సమాజం, గ్రామాలే ముఖ్యం. గ్రామాలు బాగుంటునే దేశం బాగుంటుంది. గ్రామస్థాయి నుంచి వచ్చిన నాయకులే జాతీయ స్థాయికి ఎదిగారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే కూటమి లక్ష్యం. గ్రామస్థాయి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని పవన్ పిలుపునిచ్చారు. అయితే ఇదే పవన్ కల్యాణ్.. తనకు పర్యావరణం అంటే ఇష్టమని.. పర్యావరణ ప్రేమికుడినని అందుకే ఏరికోరి మరీ ఈ శాఖను తీసుకుంటున్నట్లు జాతీయ మీడియా వేదికగా చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

అవునా.. నిజమా..!?

పవన్ చెప్పిన రుద్రవీణ స్టోరీని విన్న వీరాభిమానులు, జనసేన కార్యకర్తలు ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. అసలు పవన్‌‌లో ఈ యాంగిల్ కొత్తగా చూస్తున్నామని కొందరు చెబుతుండగా.. మరికొందరేమో అవునా నిజమా..? ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఇంకొందరేమో అబ్బో.. ఆపద్భాందవుడు కూడా చూసి పశు సంవర్ధక శాఖ, హిట్లర్ కూడా చూసి స్త్రీ శిశు సంక్షేమ శాఖ కూడా తీసుకోవాల్సింది అంటూ సెటైర్లు వేస్తున్న పరిస్థితి. ఆ మధ్య పవన్ ప్రతిసారీ అది చదవాలనుకున్నా ఇది చదివాను.. చదువు అబ్బలేదు.. అని చెప్పుకుంటూ వచ్చిన సందర్భాలను కూడా జనాలు గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు.. ఆ ఊర్లో పుట్టాను.. ఈ ఊర్లో పుట్టానని చెప్పిన పవన్ మాటలనూ గుర్తు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా విమర్శలు చేస్తున్న వారికి సోషల్ మీడియా వేదికగా జనసైనికులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.

Chiranjeevi film stopped me from becoming Home Minister:

I Was Asked To Take Home Ministry: Pawan Kalyan!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement