Advertisement
Google Ads BL

జగన్ ని నిద్రలేపడానికి ఎంత ట్రై చేసినా..!


జగన్ 2024 ఎలక్షన్ లో ఎందుకు ఓటమి చెందాడో అనేది పక్కనబెట్టి చంద్రబాబు పథకాలు ఇవ్వడం లేదు అంటూ చంద్రబాబు పాపాల లెక్కలు వేస్తూ కూర్చుంటున్నాడు, తన కోటరీ ని తప్పిస్తేనే జగన్ బాగుపడతాడు, వైసీపీ కి పూర్వ వైభవం వస్తుంది, లేదంటే జగన్ చుట్టూ గోడ కట్టిన వాళ్లే మళ్ళీ జగన్ ని ముంచేస్తారు అంటూ బ్లూ మీడియా జగన్ ని నిద్ర లేపేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా జగన్ మాత్రం అదే తరహాలో నిద్రమత్తులోనే కనబడుతున్నాడు.

Advertisement
CJ Advs

జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలపై నోరేసుకుని పడిపోతూ మీడియా ముందు ఓవరేక్షన్ చేసిన వారంతా వైసీపీ ఓటమి తరవాత బయట కనిపించడమే మానేశారు. అప్పట్లో జగన్ మెప్పు కోసం మీడియా ముందు హంగామా చేసిన వారిని జగన్ ఇకపై దగ్గరకు రానివ్వకూడదు, అలాగే తనకి విషయాలు తెలియకుండా గోడ కట్టినవారిని కూడా ఇకపై దూరం పెట్టాలి.

నోరుంది కదా అని చెలరేగిపోయిన వారికి జగన్ పదవులు కట్టబెట్టాడు, నిజంగా పని చేసేవాళ్లను జగన్ దూరం చేసుకున్నాడు, వాళ్ళు పదే పదే జగన్ నిర్లక్ష్యం పట్ల బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి జగన్ ఇకనైనా మారు. కేవలం శవరాజకీయాలే కాదు.. నీకు మంచి చేసిన వాళ్లను నువ్వు దగ్గరకు తియ్యి అంటూ సలహాలు ఇస్తుంది బ్లూ మీడియా.

మరి జగన్ ఓడిపోయి మూడు నెలలైంది. ఇప్పటికి ఓటమి కారణాలు వెతక్కుండా ఇంకా ఇంకా తాడేపల్లి, బెంగుళూరు అంటాడేమిటి అంటూ బ్లూ మీడియా నిద్ర లేపడానికి ట్రై చేస్తుంది కానీ.. జగన్ ఎంతవరకు పట్టించుకుంటాడో చూడాలి. 

No matter how much you try to wake up Jagan..!:

No matter how much Blue Media tries to wake up Jagan, Jagan is seen in the same sleepy state
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs