Advertisement
Google Ads BL

వేట మొదలు పెట్టిన TV 5 మూర్తి


టివీ 5 మూర్తి తమని ఐదు కోట్ల కోసం తన అనుచరులతో వేధిస్తున్నాడు, తమ దగ్గర అంత డబ్బు లేదు, నా బంగారం, నా కూతురు బంగారం ఏమైనా అంత రాదు అంటూ, తమకి ఆత్మహత్యే శరణ్యమంటూ వీడియో పోస్ట్ చేసిన వేణు స్వామి-ఆయన భార్య వీణ శ్రీవాణి ఓ వీడియో లో చెప్పుకొచ్చారు. అయితే TV 5 మూర్తి మాత్రం తానేమి ఎవ్వరిని డబ్బు డిమాండ్ చెయ్యలేదు అంటూ పదే పదే చెప్పడం కాదు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. 

Advertisement
CJ Advs

అయితే వేణు స్వామి ఆయన భార్య వీణ -శ్రీవాణి లు టివీ  మూర్తి పై కావాలనే అలిగేషన్ చేసారా? ఎందుకంటే గత కొద్దిరోజులుగా వేణు స్వామి మొదలపై TV 5 మూర్తి స్పెషల్ ప్రోగ్రామ్స్ చెయ్యడం వలన తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని మూర్తి బ్లాక్ మెయిల్ అంటూ అలిగేషన్ చేసారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

అసలు మూర్తి ఐదు కోట్లు అడిగాడు అనేది పక్కనపెడితే ఇప్పుడు వేణు స్వామి-వీణ శ్రీవాణిలు తనపై చేసిన ఆరోపణల తర్వాత మూర్తి అసలు వేట షురూ చేసాడు. వేణు స్వామి ఆయన భార్య వీణ శ్రీవాణి ని టార్గెట్ చేసాడు. తాజాగా మూర్తి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. వీణ శ్రీవాణి ఫామ్ హౌస్ వీడియోని రీ ట్వీట్ చేస్తూ.. 

శ్రీమతి వేణు తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో తన సొంత ఫామ్‌ హౌస్‌లో రీల్స్ చేసింది. హైదరాబాద్ శివార్లలోని ఈ పెద్ద ఫామ్‌హౌస్ విలువ కోట్లాది రూపాయలు. నిజానికి ఈ ఫామ్‌హౌస్‌ గాయత్రి ప్రజాపతికి చెందిన బినామీ ఆస్తి కావచ్చునని సమాచారం.. అంటూ అనుమానాలు రేకెత్తించే ట్వీట్ చెయ్యడం చూసిన చాలామంది నెటిజెన్స్.. అనవసరం మూర్తి ని కెలికావ్ శ్రీవాణి నీ అంతు చూసే వరకు వదలడంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

TV5 Murthy who started the hunt:

TV5 Murthy vs Veena Srivani 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs