Advertisement
Google Ads BL

భాగ్యశ్రీ బోర్సేని పట్టించుకుంటారా?


పెళ్లి సందD చిత్రంతో ఎలాంటి పేరు రాకపోయినా.. ధమాకా లో రవితేజ తో కలిసి చేసిన డాన్స్ లకు హీరోయిన్ శ్రీలీల కు టాలీవుడ్ బ్రహ్మరధం పట్టింది. టాలీవుడ్ యంగ్ స్టార్స్ వరస ఆఫర్స్ ఇచ్చి ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసారు. ఎంతెలా అంటే అవకాశం వచ్చింది కదా చాలు.. కథ, పాత్ర మనకెందుకు అనుకునేంతగా, ఆలోచించే అవకాశం కూడా ఇవ్వనంతగా శ్రీలీల కి ఆఫర్స్ వచ్చిపడ్డాయి.

Advertisement
CJ Advs

ధమాకా హిట్ అవడం శ్రీలీలని మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి చేర్చింది. ఇప్పుడు అదే రవితేజ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ సెట్స్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి అందరి కళ్ళు ఆమె పైనే. హరీష్ శంకర్ ఆమెని చాలా అందంగా, గ్లామర్ గా చూపించబోతున్నాడని మిస్టర్ బచ్చన్ సాంగ్స్ తోనే రివీల్ చేసారు. మిస్టర్ బచ్చన్ పాటలెలా ఉన్నా భాగ్యశ్రీ బోర్సే-రవితేజ రొమాన్స్ హైలెట్ అయ్యింది.

కానీ సినిమా విడుదలయ్యాక ఆమె డాన్స్ ఇరగదీసింది ఓకె, నటన పరంగా వీక్, కేవలం భాగ్యశ్రీ అందంపైన దర్శకుడు హరీష్ శంకర్ ఫోకస్ పెట్టి మిస్టర్ బచ్చన్ కథ ని పక్కదారి పట్టించడంటూ చాలామంది విమర్శించారు. మరి శ్రీలీల మాదిరి భాగ్యశ్రీని కుర్ర హీరోలు పట్టించుకుంటరా, మిస్టర్ బచ్చన్ రిజల్ట్ చూసాక మనకెందుకు ఈ హీరోయిన్ అనుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Do you care about Bhagyashri Borse?:

Did Mr. Bachchan Bhagyashri Borse get any help?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs