Advertisement
Google Ads BL

వేణు స్వామి కి ఆ ఛాన్స్ మిస్ అయినట్లేనా?


ప్రస్తుతం కాదు ఎప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ గా కనిపించే ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఇప్పుడు నాగ చైతన్య-శోభితల జాతకం చెప్పి అడ్డంగా ఇరుక్కున్నాడు. జర్నలిస్ట్ సంఘాలు, మా అధ్యక్షుడు, అక్కినేని ఫ్యాన్స్ వేణు స్వామి పైకి చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ ఇవ్వడంతో వేణు స్వామి భార్య వీణ శ్రీవాణి తో సహా ఓ వీడియో వదిలాడు. తమని కొంతమంది జర్నలిస్ట్ లు డబ్బు కోసం వేధిస్తున్నారంటూ ఆ వీడియోలో చెప్పారు, అంతేకాదు తమకి ఆత్మహత్యే శరణ్యమంటూ చెప్పడంతో అందరూ షాకయ్యారు. 

Advertisement
CJ Advs

అయితే తమపై హాట్ హాట్ గా నడుస్తున్న ఇష్యు ని డైవర్ట్ చేసేందుకే భార్య-భర్తలు ఈ రకమైన నాటకానికి తెరతీశారంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అదలా ఉంటే ఈ తాజా ఇష్యు వలన వేణు స్వామి ఓ ఆఫర్ మిస్ అయ్యాడట. అదే బిగ్ బాస్. బిగ్ బాస్ 8 కి వేణు స్వామికి ఆఫర్ వచ్చింది అని, అతను హౌస్ లోకి అడుగుపెడతాడని అన్నారు. 

కానీ ఇప్పుడు వేణు స్వామి ని బిగ్ బాస్ యాజమాన్యం తప్పించినట్లుగా టాక్. కారణం హోస్ట్ నాగార్జున కొడుకు నాగ చైతన్య విషయంలో వేణు స్వామి చెప్పిన జాతకం కారణంగానే వేణు స్వామికి ఈ ఛాన్స్ తప్పిపోయినట్లుగా చెబుతున్నారు. అది విని అయ్యో వేణు స్వామి మంచి ఆఫర్ మిస్ చేసుకున్నావ్ గా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్. 

Did Venu Swamy miss that chance?:

Astrologer Venu Swamy is out of Bigg Boss Season 8
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs