Advertisement
Google Ads BL

చాలా దూరంలో చైతు-శోభితల వివాహం


ఆగష్టు 8 న అనూహ్యంగా ఇరు కుటుంబాల నడుమ సైలెంట్ గా నిశ్చితార్ధం చేసుకుని.. ఆ విషయాన్ని బయటపెట్టిన నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ పిక్స్ ఎంతెలా వైరల్ అయ్యాయో అందరూ చూసారు. కింగ్ నాగార్జున కూడా కొడుకు సంతోషాన్ని అభిమానులకి షేర్ చేసారు. మరి నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలెక్కుతుందా అని అక్కినేని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

నాగార్జున నాగ చైతన్య-శోభితల వివాహానికి కాస్త సమయం ఉంది. మరో రెండు మూడు నెలల తర్వాతే వీరి వివాహం ఉంటుంది అని చెప్పారు. తాజా సమాచారం ప్రకారం చైతు-శోభితల కమిట్మెంట్స్ పూర్తయ్యే వరకు అంటే చైతు తండేల్ విడుదల అయ్యేవరకు, శోభిత నటిస్తున్న ప్రాజెక్ట్స్ ఓ కొలిక్కి వచ్చేవరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నారట. 

అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ నడుమ జరగబోయే ఈ శుభకార్యం కోసం అందరి సమయాన్ని బట్టి పెళ్లిని ప్లాన్ చెయ్యాలనుకుంటున్నారట. ఈఏడాది చివరిలో కానీ, లేదంటే వచ్చే ఏడాది మార్చిలో కానీ చైతు-శోభితల వివాహం రాజస్థాన్ లో జరిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది. 

Chaitu-Sobhitala marriage far away:

Is Naga Chaitanya and Sobhita wedding venue set?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs