Advertisement
Google Ads BL

మెగాస్టార్ కు పవర్ స్టార్ విషెస్


ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజేవి బర్త్ డే. మెగాస్టార్ బర్త్ డే కి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు తన విషెస్ ని సోషల్ మీడియా వేదికగా అందజేస్తున్నారు. ఈ స్పెషల్ డే కి కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి తెల్లవారు ఝామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తల్లి అంజనమ్మ, భార్య సురేఖ, మానవరాళ్లతో కలిసి నేడు మెగాస్టార్ శ్రీవారి సన్నిధిలో కనిపించారు. 

Advertisement
CJ Advs

ఇక మెగాస్టార్ బర్త్ డే కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా తెలిపిన బర్త్ డే విషెస్ వైరల్ అయ్యాయి. 

ఆపద్బాంధవుడు అన్నయ్య

నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో  సహాయాలు గుప్తంగా  మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు. అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో!

గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా శ్రీ చిరంజీవిగారు ఆశీర్వదించారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్ని. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా  కోరుకుంటున్నాను.. అంటూ పవన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 

Pawan heartfelt wishes to Mega Star:

Pawan Kalyan Emotional Wishes To Chiranjeevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs