పాపం వేణు స్వామి తాను గత ఎనిమిది నెలలుగా TV 5 మూర్తి వేధింపులు తట్టుకోలేక 15 కిలోల బరువు తగ్గిపోయాడట, మేము గనక జ్యోతిష్కం చెప్పకొకపోతే చచ్చిపోము కదా, ఆయన సత్యన్నారాయణ స్వామి కథలు చెబుతారు, నేను వీణ క్లాస్సేస్ చెప్పుకుంటాను, అంతేకాని చచ్చిపోము కదా అని చెప్పిన వీణా శ్రీవాణి ఇప్పుడు మూర్తి బ్యాచ్ తమని ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారని తమకి ఆత్మహత్యే శరణ్యమంటూ వేడుకోవడం విచిత్రంగా ఉంది.
తమకి బ్రాహ్మణ సంఘాలు కానీ, జర్నలిస్ట్ లు కానీ, లాయర్లు సుమోటాగా కేసు తీసుకుని సపోర్ట్ చెయ్యాలంటూ అడుక్కోవడం మరింత విచిత్రంగాను ఉంది. మరి వైసీపీ నేతలతో కలిసి మెలిసి తిరిగి 2024 ఎన్నికల్లో జగన్ గెలవకపోతే జ్యోతిష్కం చెప్పనని చెప్పిన వేణు స్వామి కి ఇప్పుడు వైసీపీ సపోర్ట్ లేదా అని అడుగుతున్నారు సదరు నెటిజెన్స్.
వైసీపీ గెలుస్తుంది అని చెప్పడంతో చాలామంది వైసీపీ పై బెట్టింగ్స్ వేసి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలైతే ఏపీలో చాలానే జరిగాయి. వీళ్ళు చేసింది తప్పు కాదు ఎవరో పెళ్లి చేసుకుంటుంటే.. వారు అడక్కుండానే పబ్లిక్ ప్లాట్ ఫామ్ పై జాతకం చెప్పడం కరెక్ట్ ఆ వీణ గారు, దాని నుంచి బయటపడడానికి జర్నలిస్ట్ లపై ఆరోపణలు చేస్తే ఊరుకుంటారా.. అందుకే వారు మీ మీద కంప్లైంట్స్ ఇస్తూ మీ అంతు చూసే వరకు వదలరు.
మరి ఇంత జరుగుతున్నా మీ వైసీపీ నేతలెవరూ మిమ్మల్ని పట్టించుకోరా అంటూ చాలామంది వేణు స్వామిని, ఆయన భార్య వీణ శ్రీవాణిని అడుగుతున్నారు. నిజమే కదా ఇప్పుడు వేణు స్వామికి వైసీపీ సపోర్ట్ ఎంతో అవసరం, కానీ వాళ్లేమో వేణు స్వామిని అస్సలు పట్టించుకోవడమే లేదు.