Advertisement
Google Ads BL

ధరిత్రి గర్వించే ఓ చరిత్ర.. చిరంజీవి


పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు (ఆగస్ట్ 22). చిరంజీవి పుట్టినరోజు అంటే.. కేలండర్‌లో ప్రకటించని ఓ పండగరోజు. దేశవ్యాప్తంగా.. కాదు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానుల్లో కొందరు గ్రాండ్‌గా ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటే.. మరికొందరు ‘అన్నయ్యా హ్యాపీ బర్త్‌డే’ అని మనసులోనే చెప్పుకుని.. మెగాస్టార్‌పై ప్రేమ, అభిమానాన్ని గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే.. వారికి అదొక ఎమోషన్. పుట్టి, పెద్దయ్యే క్రమంలో చాలా తెలుసుకుంటూ ఉంటాం.. ఒక్కో స్టేజ్‌లో ఒక్కోదానిని వదిలేస్తూ.. కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఏ స్టేజ్‌లో కూడా వదలని, మరిచిపోని కొన్ని ఎమోషన్స్ ఉంటాయ్.. ఆ ఎమోషన్స్‌లో ఒకటే చిరంజీవి. ఇంకా చెప్పాలంటే 80స్, 90స్ బ్యాచ్‌కి ఈ ఎమోషన్ ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే, వారు చిరంజీవితో కలిసి నడిచారు, చిరంజీవితో పాటే ఎదిగారు. ఎప్పుడూ కలవకపోయినా, ఈ వెండితెర నటరాజుని మా ఫ్యామిలీ మెంబర్లలో ఒకరని భావించే బ్లడ్ పంచుకోని బ్రదర్స్ ఎందరో ఉన్నారు. మా ఇంటి బిడ్డే అని చెప్పుకునే తల్లిదండ్రులు.. మా అన్నయ్యే, మా తమ్ముడే అని ఆరాధించే తమ్ముళ్లు, చెల్లెళ్లు, అక్కలు, అన్నలు ఎందరెందరో ఉన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారందరిలో చిరు నింపిన స్ఫూర్తి అలాంటిది. అలాంటి స్పూర్తి ప్రదాతకు ప్రపంచవ్యాప్తంగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండటంలో ఆశ్చర్యం ఏముంటుంది..

Advertisement
CJ Advs

కష్టజీవికి కేరాఫ్ అడ్రస్

ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్రాడు.. ఈ రోజు ఒక మహావృక్షంలా నిలబడ్డారంటే.. దాని వెనుక ఎంత కష్టం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిరంజీవి కష్టాన్ని ప్రత్యక్షంగా చూసినవారు చెప్పే మాటలు విన్నా.. ఆయన సినిమాలలోని రిస్కీ స్టంట్స్ చూసినా.. కష్టజీవికి కేరాఫ్ అడ్రస్ చిరు అని అనకుండా ఉండలేరు. ఎన్నో అవరోధాలను దాటుకుని.. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి, చేరుకోవడానికి చిరు పడిన శ్రమే.. నేడు ఆయనని పద్మ విభూషణుడి స్థాయికి చేర్చింది. ఏ పదవీ లేకపోయినా.. రెండు తెలుగు రాష్ట్రాలని శాసించే స్థాయిని ఇచ్చింది. రంగస్థలం సినిమా వేదికపై సుకుమార్ వంటి దర్శకుడు చిరంజీవి రాజకీయ జర్నీ గురించి మాట్లాడుతూ.. ఆయన రాజకీయాల్లోకి వెళుతున్న సమయంలో.. ఆయనకెందుకు రాజకీయాలు, సీఎం కంటే పెద్ద పదవి మెగాస్టార్ ఉండగా అని అన్నారంటే.. ఆ స్థాయికి చేరుకోవడానికి చిరు ఎంత కృషి చేశారనేది తెలియజేస్తోంది. 

చిరు ముందు వారంతా జుజుబీ..

చిరంజీవి సినిమాలు, ఆయన యాక్టింగ్, డ్యాన్స్‌ల గురించి ఎప్పుడూ వినబడుతూనే ఉంటుంది. ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది. ఎందుకంటే, ఆయన క్రియేట్ చేసిన మార్క్ అలాంటిది. డ్యాన్స్‌కి గ్రేస్ అనేది ఉంటే అది చిరంజీవే. చిరంజీవి తర్వాతే ఎవరైనా. ఈ మధ్య సోషల్ మీడియాలో చిరంజీవి డ్యాన్స్ గురించి కొందరు హీరోల అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. వారందరికీ చెప్పేది ఒక్కటే. మీ హీరోలు నిక్కర్లు వేసుకునే సమయంలోనే ఆయన ఇండస్ట్రీని శాసించాడు, శాసిస్తూనే ఉన్నాడు. మీ తరం కాదు కదా.. మీ హీరోల తరం కూడా కాదు.. ఆయనతో పోల్చుకోవడానికి. ఇది గుర్తు పెట్టుకోండి. ఇంకొందరు ఉన్నారు.. ఒక్క సినిమాతోనే తామేదో పొడిచేశామని విర్రవీగే రకం. అలాంటివారికి కూడా చెప్పేది ఒక్కటే.. చిరు ముందు మీరంతా ఆప్ట్రాల్ అంతే. ఆయన మాట వింటే బాగుంటారు.. లేదంటే ముందు ముందు మీకే తెలుస్తుంది మెగా సునామీ ఎలా ఉంటుందో. ఒక్కటి గుర్తుపెట్టుకో.. రికమండేషన్‌లతో వచ్చే స్టేటస్ కానీ, అవార్డ్స్ కానీ ఎప్పటికీ శాశ్వతం కావు. ఎదుటివారిని గౌరవించే తీరుతో పాటు, పునాదిని మరిచిపోని వారు మాత్రమే ఎప్పటికీ ఉంటారు. అది హీరోలైనా, వారి ఫ్యాన్స్ అయినా గుర్తు పెట్టుకుని మసులుకుంటే మంచిది.  

దేశ రాజకీయాల్లో చిరు నామస్మరణ

తెలంగాణలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ.. ఏపీలో గెలిచింది బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి. దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం పాలిటిక్స్‌‌కి దూరంగా ఉన్నప్పటికీ.. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా పొలిటికల్‌గా చిరు నామస్మరణే జరుగుతుందంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మరీ ముఖ్యంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ విక్టరీ తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్లిన వీడియో అయితే.. ప్రపంచ నలుమూలలలో ఉన్న తెలుగు వారందరి కళ్లు చెమ్మగిల్లేలా చేసింది. అన్నదమ్ముల అనుబంధం అంటే ఇలా ఉండాలనేలా అనుకున్నామని దేశ ప్రధాని నరేంద్రమోడీ అన్నారంటే.. ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది. అది కదా.. చిరు నేర్పిన సంస్కారం. ఆ మధ్య ఇండస్ట్రీ తరపున మాట్లాడడానికి వెళితే.. అప్పటి సీఎం చిరుని అవమానించిన ప్రతిఫలం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూశాడు. అలాగే ఏ హోదా అయితే చిరుని అవమానించిందో.. అదే హోదా ప్రమాణ స్వీకారానికి విశిష్ట అతిథి రూపంలో ఆహ్వానం రావడం అంటే.. ఎంతమందికి ఇది సాధ్యమవుతుంది. చిరంజీవిగారు స్టేజ్ మీదే ఉన్నారని అనగానే.. దేశ ప్రధానే స్వయంగా ఆయనని కలవడానికి, ఆయన దగ్గరకు వెళ్లడం.. ఇంకేం కావాలి చిరు గొప్పతనం తెలియడానికి. ఆ మధ్య ఓ సినిమాలో చిరు చెప్పిన డైలాగ్‌లా.. రాజకీయం తను వదిలేసినా.. తనని మాత్రం రాజకీయం వదలలేదనేదే అక్షరాలా సత్యం. 

చిరంజీవి కృషే.. 

చిరంజీవి అంటే తెలుగు వాళ్ల ఆస్తి. అందుకే అంతా అన్నయ్యా అని పిలచుకుంటూ ఉంటారు. అలాగే చిరు కూడా తనని ఇంతవాడిని చేసిన వారి కోసం ఎప్పుడు, ఏ అవసరమైనా ముందుంటూ.. పెద్దరికం చాటుతున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే ఒకప్పుడు బాలీవుడ్ చాలా పెద్ద సినీ పరిశ్రమ. బిగ్ బి వంటి పెద్దలున్నా కూడా ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ టాలీవుడ్‌కి వచ్చేసరికి మొదట వినబడే పేరు చిరంజీవి. టాలీవుడ్ ఓ క్రమశిక్షణతో నడుస్తుందంటే, ప్రపంచ సినిమానే శాసిస్తుందంటే కచ్చితంగా దీని వెనుక చిరంజీవి కృషి ఎంతో ఉంది. అదేంటో చాలా మందికి తెలియదు. కానీ తెలియాల్సిన వాళ్లకి తెలుసు. అందుకే ఏ చిన్న విషయమైనా.. చిరంజీవి ఇంటి గడప తడుతూ ఉంటుంది. మధ్యలో కొందరు పెద్దరికం అని ఊగారు కానీ.. అది అనుకుంటే వచ్చేది కాదనీ త్వరగానే తెలుసుకున్నారు.

చిన్న విజ్ఞప్తి..

చిరంజీవిగారు మీకు చిన్న విజ్ఞప్తి. మీరు అభిమానులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరికీ తెలుసు. అభిమానులను సక్రమమైన మార్గంలో నడిపించిన, నడిపిస్తున్న హీరో ఎవరంటే.. కచ్చితంగా మీ పేరే ఉంటుంది. అలాంటి మీరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. అంటే వారికి ఏదో చేసేయమని కాదు.. చేయమన్నా చేస్తారనుకోండి.. అది వేరే విషయం. విజ్ఞప్తి ఏమిటంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏపీలో కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది. తెలంగాణలో ఎలా అయితే సినిమా ఇండస్ట్రీ ఉందో.. రెండో కన్నుగా భావించి ఏపీలో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి మీరు కృషి చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మీకు ఫ్రెండ్లీ ప్రభుత్వమే. సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం, మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా మీ మాటని కాదనరు. ఇదే సరైన సమయం. ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నాం. అలాగే ఇంకో విజ్ఞప్తి ఏమిటంటే.. హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కోండకోట వంటివి ఎలాగో.. మెగాభిమానులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా అలానే. మీ పిలుపుతో దేశదేశల నుంచి వచ్చి మరీ బ్లడ్ డొనేట్ చేసే వారెందరో. ఇప్పుడా ఫెసిలిటీని ఏపీ మెగాభిమానులకు కూడా కల్పించండి. ఏపీ రాజధాని అమరావతిలో కూడా ఐకానిక్‌గా నిలిచిపోయే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ని ఏర్పాటు చేయాలని కోరుతూ.. మీరు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని, ఇంకా ఎంతోమందికి స్ఫూర్తిప్రదాతగా నిలవాలని మనసారా కోరుకుంటూ సినీజోష్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది. హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్ చిరంజీవి. 

Megastar Chiranjeevi Birthday Special Article:

Chiranjeevi Dharitri Proud With Your History
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs