Advertisement
Google Ads BL

ఎందుకండీ అంత ఎగ్జైట్ అవుతున్నారు


సుకుమార్-అల్లు అర్జున్ కలిసి పుష్ప 1 తో బ్లాక్ బస్టర్ కొట్టి ఆ చిత్రంలో కేరెక్టర్ కి గాను అల్లు అర్జు నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇక దానికి సీక్వెల్ గా పుష్ప 2 రాబోతుంది. కొద్దిరోజులుగా పుష్ప ద రూల్ సెట్స్ లో ఏదో జరిగిపోయింది, దర్శకుడు సుకుమార్ కోపంతో ఐ ఫోన్ విసిరేశారు, అల్లు అర్జున్ కుర్చీని తన్నేశాడంటూ చెప్పుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

ఆ ఈగో తోనే సుకుమార్, అల్లు అర్జున్ విడివిడిగా వెకేషన్ కి వెళ్లారు, పుష్ప రాజ్ లుక్ నుంచి అల్లు అర్జున్ బయటికొచ్చేసాడు అబ్బో ఇలాంటివి చాలా ప్రచారంలోకి వచ్చాయి. బన్నీ వాస్ వారి మద్యన ఎలాంటి క్లాషెస్ లేవు అని చెప్పాడు. ఈమధ్యన పుష్ప 2 షూటింగ్ రెగ్యులర్ గా కూల్ గా జరుగుతున్న సందర్భంలోను హీరో-దర్శకుడు మద్యన సాటౌట్ అవ్వలేదు, సుకుమార్ తరచూ హెల్త్ రీజన్స్ అంటూ ప్యాకప్ చెప్పేస్తున్నారంటూ మళ్ళీ గాసిప్స్ ఊపందుకున్నాయి. కట్ చేస్తే ఈరోజు హైదరాబాద్ లో జరిగిన మారుతి నగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్-అల్లు అర్జున్ గెస్ట్ లుగా హాజరయ్యారు. 

అదే ఈవెంట్ లో ఇద్దరూ హగ్ చేసుకోవడం చూసి హమ్మయ్య హగ్ చేసుకున్న సుక్కు-బన్నీ అంటూ ఎగ్జైట్ అవుతున్నారు సినిమా మిత్రులు. అది చూసి వారిద్దరూ బాగానే ఉన్నారు, కానీ మీరే ఏదో ఊహిచేందుకున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు అల్లు అభిమానులు. ఇక సుకుమార్ ని యాంకర్ సుమ మీ కాంబోలో ఆర్య 1 ఆర్య 2, పుష్ప 1, పుష్ప2 వస్తున్నాయి.. అక్కడితో ఆగుతాయా అంటే లేదు.. 1,2,3,4 వస్తూనే ఉంటాయని సుక్కు చెప్పగానే అల్లు అర్జున్ హమ్మో అంటూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ వైరల్ అయ్యింది. 

ఇక సుమ అల్లు అర్జున్ వద్దకు వచ్చి సెట్ లో సుకుమార్ గారి ఊతపదం ఏమిటి అనగానే అల్లు అర్జున్ ఆలోచిస్తూ డార్లింగ్ వన్ మోర్(ఈవిషయంలోనే అల్లు అర్జున్ సుక్కు పై కోపంగా ఉన్నాడనే టాక్ ఉంది)అంటారంటూ చెప్పిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి కూర్చుంది. 

Sukumar-Allu arjun hug in Maruthi Nagar Subramanyam:

Allu Arjun & Sukumar as Chief Guest - Maruthi Nagar Subramanyam Pre Release Event 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs