Advertisement
Google Ads BL

విశ్వంభర ట్రీట్ పై మెగా సస్పెన్స్


మరికొన్ని గంటల్లో మెగాస్టార్ బర్త్ డే వేడుకలు మొదలైపోతాయి. ఆగష్టు 22 అర్ధరాత్రి నుంచే మెగా అభిమానులు కోలాహలంగా చిరు పుట్టిన రోజు వేడుకలను కేక్ కటింగ్స్ తో సెలెబ్రేట్ చేసుకుంటానికి సిద్దమైపోతారు. అటు మెగాస్టార్ ఫ్యామిలీతో సహా తిరుమలకు బయలుదేరారు. రేపు గురువారం చిరు పుట్టిన రోజు స్పెషల్ గా విఐపి బ్రేక్ దర్శనంలో చిరు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

Advertisement
CJ Advs

ఇక మెగా ఫ్యాన్స్ కేక్ కటింగ్స్, రక్త దానాలతో బాస్ కి విష్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. 

అయితే చిరు లేటెస్ట్ మూవీ విశ్వంభర నుంచి ఎలాంటి ట్రీట్, ఎప్పుడు రాబోతుంది అనే విషయంలో మెగా సస్పెన్స్ లో నడుస్తుంది. వసిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర నుంచి టీజర్ రాబోతుంది అనే ప్రచారం జరుగుతుంది. కానీ మేకర్స్ నుంచి అప్ డేట్ లేదు. రేపు ఏ సమయానికి టీజర్ వదులుతారనే విషయంలో మెగా ఫ్యాన్స్ లో గందరగోళం మొదలైంది. 

బాస్ బర్త్ డే కి ఎలాంటి హడావిడి ఉండాలి, టీజర్ అప్ డేట్, పోస్టర్ అప్ డేట్ అంటూ హంగామా చెయ్యాల్సింది పోయి ఇంత సైలెంట్ గా ఉంటే ఎలా అంటూ మెగా ఫ్యాన్స్ సీరియస్ కూడా అవుతున్నారు. చూద్దాం ఏమి చెప్పకుండా వసిష్ఠ ఎలాంటి సర్ ప్రైజ్ ప్లాన్ చేసాడో అనేది. 

Mega suspense on Vishwambhara treat:

All eyes on Vishwambhara special treat 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs