మెగా ఫ్యామిలీలోకి చిన్న కోడలుగా అడుగుపెట్టిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్ళికి ముందు ఎలాంటి క్రేజ్ ఉందొ అందరికి తెలుసు. కానీ పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి మెగా కోడలుగా గౌరవం పొందుతుంది. మెగా ఫ్యాన్స్ నుంచి ఆదరణ అందుకుంటుంది. నాగబాబు కోడలుగా, వరుణ్ తేజ్ భార్య గా లావణ్య త్రిపాఠి తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది.
అత్తగారితో కలివిడిగా పచ్చళ్ళు పట్టడం, మరదలు నిహారికతో కలిసి సందడి చెయ్యడం, గత శుక్రవారం అత్తగారు, మరదలు తో కలిసి వరలక్ష్మి వ్రతాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించిన లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. రీసెంట్ గా లావణ్య పేరెంట్స్ భర్త వరుణ్ తేజ్ తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చింది.
తాజాగా ఆమె వదిలిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పిక్ చూడగానే మెగా చిన్న కోడలు రాయల్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మోడ్రెన్ వేర్ లో లావణ్య నిజంగా రాజకుమారిలా మెరిసిపోయింది. ఆమె నడక, ఆమె స్టయిల్ అన్ని రాయల్ గా కనిపిస్తున్నాయనడంలో సందేహం లేదు.