Advertisement
Google Ads BL

ఏపీలో టీ, బిస్కెట్స్.. ఎగ్ పఫ్స్ గోల..!!


ఏపీలో ఎవ్వరూ తగ్గట్లేదు..! అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి అస్సలు తగ్గకపోగా.. ఘోరంగా ఓడిపోయిన వైసీపీ ఐతే తగ్గేదేలా అన్నట్లుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఏదో ఒక విషయంలో టీడీపీ వర్సెస్ వైసీపీగా పరిస్థితులు నడుస్తూనే ఉన్నాయ్. నిన్న మొన్నటి వరకూ సూపర్ సిక్స్ విషయంలో ఎంత రాద్దాంతం జరిగిందో అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ డైవర్ట్ ఐపోగా .. టీ, బిస్కెట్స్.. ఎగ్ పఫ్స్ పై పెద్ద రచ్చే నడుస్తోంది. ఇదిగో మీరు తిన్నది అంటూ వైసీపీకి సంబంధించిన లెక్కలు టీడీపీ  చెబుతుంటే.. అబ్బే అదంతా అచ్చు తప్పు అని వైసీపీ ఖండిస్తూనే టీడీపీ లెక్కలు తీసింది. సోషల్ మీడియా, మీడియా మొత్తం ఇప్పుడు ఇదే బర్నింగ్ టాపిక్ అయ్యింది. 

Advertisement
CJ Advs

హే.. టీ, బిస్కెట్..!!

నాడు.. నేడు నారా లోకేష్ ఏ మాత్రం తిండిలో తగ్గలేదని సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. టీ, బిస్కెట్ల ఖర్చులపై పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. టీ, బిస్కెట్లకే లక్షల్లో ఖర్చు పెట్టారని తీవ్ర విమర్శలు వస్తున్నాయ్. టీ కోసం నెలకు రూ.60 లక్షలు.. బిస్కెట్లకు రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు.. టీ అత్యంత ఖరీదైనదని అందుకే ఇంత రేటు ఉందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఐతే ఇదంతా ఫేక్ అని.. ఈ ప్రచారాన్ని ప్రజలు ఎవ్వరూ నమ్మొద్దు అని ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. పనిలో పనిగా ఇలాంటి ఫేక్ పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సర్కార్ స్తరింగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో టీ, బిస్కెట్ గోలకు ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది. 

3.62 కోట్లకు ఎగ్ పఫ్స్..!

ఇక ఎగ్ పఫ్స్ విషయానికి వస్తే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నన్ని రోజులు 2019 నుంచి 2024 వరకూ కోట్లలో ఖర్చు చేసిందన్నది అతి పెద్ద ఆరోపణ. జగన్ ప్రభుత్వం ఎగ్ పఫ్స్ కోసం రూ.3.62 కోట్లు దుర్వినియోగం చేసిందని టీడీపీ లెక్కలు తీసి నానా రచ్చ చేసింది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై తీవ్ర దుమారమే అవుతోంది. నాలుగైదు రోజులుగా అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. దీనిపై వైసీపీ స్పందిస్తూ తీవ్రంగా ఖండించింది. జగన్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా పచ్చ మీడియా, పచ్చ పార్టీ బురద చల్లుతున్నదని మండిపండింది. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందుకొచ్చి.. చావలేక, పాలించే సత్తాలేక, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక జగన్ మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తక్షణమే ఈ మాటలు కట్టిపెట్టమని నాని హెచ్చరించారు. చూశారు కదా.. ఇదే ఏపీలో ప్రస్తుతం నడుస్తున్న వ్యవహారం.. అధికారం ఇచ్చింది ఎందుకనే విషయాన్ని కూటమి.. ఎందుకు అధికారం పోయిందనే విషయాన్ని వైసీపీ పార్టీలు పూర్తిగా పక్కన పెట్టేసి ఒకరిపై ఒకరు మాటల తూటాలు.. లెక్కలేనన్ని ఆరోపణలు చేసుకుంటూ పోతే ఏం ప్రయోజనం అనే ఇకనైనా తెలుసుకుంటే మంచిది మరి.

Tea, Biscuits.. Egg Puffs gola in AP..!!:

No one is down in AP..!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs