ఇంకేంటి తమన్నా ఫేడౌట్ అయ్యింది అందుకే సౌత్ నుంచి బాలీవుడ్ కి చెక్కేసింది అన్నారు. ప్రస్తుతం తెలుగులో ఓదెల 2 చేస్తున్న తమన్నా అవకాశం వస్తే ఐటెం సాంగ్స్ చెయ్యడానికి కూడా వెనక్కి తగ్గదు. ఎన్టీఆర్ జై లవ కుశ చిత్రంలోనూ, రజినీకాంత్ జైలర్ లో స్పెషల్ సాంగ్ ఇలా తమన్నా చాలా సందర్భాల్లో ఐటమ్ సాంగ్స్ లో మెరిసింది.
ప్రస్తుతం ఆమె హిందీ లో వెబ్ సీరీస్ లు అవి చేస్తుంది. అయితే తమన్నా ఇంకా ఫెడవుట్ లిస్ట్ లోకి వెళ్ళలేదు, ఇంకా ఆమె రేంజ్ తగ్గలేదు అని నిరూపిస్తుంది. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా 200 కోట్ల క్లబ్బులోకి వెళ్లి ఇంకా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న శ్రద్ద దాస్ స్త్రీ 2లో తమన్నా భాగమవడమే దానికి కారణం.
స్త్రీ 2లో ఆజ్ కి రాత్ సాంగ్ లో డాన్స్ చేసిన తమన్నా, ఆ పాట బాగా పాపులర్ అయ్యింది. అటు సినిమా హిట్ అవడంతో ప్రేక్షకులు ఎక్కడ చూసినా తమన్నా పాట గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ పాట కోసం తమన్నా ఐదు నిమిషాల నిడివిలో కనిపించింది. దానికే తమన్నా కోటి రూపాయల పారితోషికం అందుకుంది.
స్త్రీ 1లో నోరా ఐటెం సాంగ్ చేస్తే స్త్రీ 2 కి మాత్రం ఆమె ప్లేస్ లో తమన్నా ని తీసుకొచ్చారు. అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యింది. నార్త్ ఆడియన్స్ ఈ పాట ని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఐదు నిమిషాలకు కోటి అంటే ఈ లెక్కన తమన్నా డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు.